India Vs Pakistan: ప్రస్తుతం ప్రపంచ దేశాలు వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడటానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈసారి ప్రతి జట్టు కూడా వరల్డ్ కప్ కొట్టాలని చాలా దృఢ సంకల్పం తో ఉన్నట్టు గా తెలుస్తుంది. ఈసారి కప్ మీద ప్రతి టీం కూడా చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ కప్పు కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి.ఇక అక్టోబర్ 05 వ తేదీ న వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ టీం లు తలపడనున్నాయి.ఇక ప్రపంచ కప్ లో ఇండియా టీం 8 వ తేదీన ఆస్ట్రేలియా తో ఒక భారీ మ్యాచ్ ఆడనుంది ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి ఇండియా వరల్డ్ కప్ లో బోణి కొట్లాలని చూస్తుంది.ఇక దానితో పాటు గా ఇండియా టీం రీసెంట్ గా ఆస్ట్రేలియా మీద గెలవడం కూడా మన టీం కి బాగా కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి…
ఇక ఈ మ్యాచ్ తర్వాత ఇండియా 11 వ తేదీన ఆఫ్గానిస్తాన్ మీద ఒక మ్యాచ్ ఆడుతుంది.ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత 14 వ తేదీన ఇండియా పాకిస్థాన్ మీద ఒక భారీ మ్యాచ్ ఆడనుంది ఇక రీసెంట్ గా ఏషియా కప్ లో పాకిస్థాన్ టీం ని చిత్తూ గా ఓడించిన ఇండియా ప్రస్తుతం వరల్డ్ కప్ లో కూడా వాళ్ళని ఓడించడానికి రెడీ అవుతుంది. ఏషియా కప్ లో ఓడించడం వేరు ఇక్కడ ఓడించడం వేరు.అయితే పాకిస్థాన్ ని ఎన్నిఎక్కువ సార్లు ఓడిస్తే అన్నిసార్లు ఇండియన్ అభిమానులు సంబరాలు చేసుకుంటారు…ఇక ఈ మ్యాచ్ కోసం ప్రపంచ దేశాలు సైతం ఎదురు చూస్తున్నాయి దీనికి కారణం దాదాపు 7 సంవత్సరాల పాటు పాకిస్థాన్ టీం ఇండియా కి రాలేదు దాంతో ఇప్పుడు ఇండియా లో అడుగుపెట్టిన పాకిస్థాన్ టీం వరల్డ్ కప్ కోసం సర్వ సిద్ధం చేసుకుంది…
ఇక పాకిస్థాన్ ఇండియా టీం ల మధ్య తరుచు ద్వైపాక్షిక సిరీస్ లు అనేవి జరగవు కాబట్టి ఏది జరిగిన ఐసీసీ సర్వహించే మ్యాచ్ లు లేదు ఏసీసీ నిర్వహించే మ్యాచుల్లోనే ఈ రెండు టీం లు తలపడాల్సి ఉంటుంది.అయితే చాలా సంవత్సరాల నుండి ఇండియా పాకిస్థాన్ కి వెళ్లడం లేదు పాకిస్తాన్ ని ఇండియా కి రానివ్వడం లేదు కాబట్టి ఈ రెండు టీం ల మధ్య మ్యాచులు కూడా జరగడం లేదు. ఇక దీన్ని దృష్టి లో ఉంచుకొని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక కీలక ప్రతిపాదన చేసింది.అదేంటంటే ప్రతి సారి ఈ రెండు టీం ల మ్యాచ్ ల కోసం అభిమానులు ఎదురుచూడకుండా ప్రతి సంవత్సరం ఇండియా పాకిస్థాన్ మధ్య ఒక ద్వైపాక్షిక సిరీస్ ఉండేలా చూసుకుందాం… అలాగే దీనికి గాంధీ జిన్నా ట్రోఫీ అనే పేరు పెడుదాం, మిగితా దేశాలతో ఎలాగైతే ఈ రెండు టీం లు మ్యాచులు ఆడుతాయో వీటి మధ్య కూడా అలాంటి మ్యాచు లు ఉండేలా ప్లాన్ చేద్దాం అంటూ పిసిబి ఛైర్మెన్ జకా అష్రాఫ్ సూచించారు.ఇక ఈ ప్రతిపాదనని బిసిసిఐ కి కూడా పంపించడం జరిగింది.
ఈ ప్రతిపాదనని బిసిసిఐ ఆమోదించడం ఒక్కటే బ్యాలెన్స్ గా ఉండిపోయింది.ఇంకా జకా అష్రాఫ్ మాట్లాడుతూ ఇలా రెండు దేశాల మధ్య ఒక పోటీ అనేది ఉండటం బాగుంటుంది. అలాగే ఈ మ్యాచ్ లో ఇండియా లో ఆడిన పర్లేదు, పాకిస్థాన్ లో ఆడిన పర్లేదు లేదు, లేదా వేరే దేశం లో ఆడిన పర్లేదు కానీ ఈ మ్యాచ్ ఆడితే రెండు దేశాలకి మంచి బెన్ ఫిట్ ఉంటుంది అంటూ ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు…ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి టీం లు పాకిస్థాన్ పర్యటించాయని వీలైతే ఇండియా కూడా పాకిస్థాన్ వచ్చి మ్యాచులు ఆడితే బాగుంటుందని అలా అయితే ఇరు దేశాల మధ్య ఒక మంచి స్నేహబంధం ఏర్పడుతుంది అంటూ ఆయన మాట్లాడటం జరిగింది…