Bhuvneshwar Kumar Inswinger: భువనేశ్వర్ కుమార్.. ‘నకుల్’ బాల్ ను కనిపెట్టింది ఈ భారత బౌలరే.. బౌలింగ్ లో వైవిధ్యం.. అస్సలు భీకర బ్యాట్స్ మెన్ క్రీజులో ఉన్న కట్టిపడేసేలా బౌలింగ్ చేయగల సామర్థ్యం మన భువి సొంతం. మధ్యలో ఫాం కోల్పోయినా ఇప్పుడు రీఎంట్రీలో భువి అదరగొడుతున్నాడు. తన బౌలింగ్ తో ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేస్తున్నాడు.

ప్రపంచ టీ20లో ఇంగ్లండ్ టీం నంబర్ 1 జట్టు. గత టీ20 ప్రపంచకప్ లోను ఆ జట్టు సత్తా చాటింది. భీకర ఆల్ రౌండర్లు, భారీ బ్యాట్స్ మెన్లు ఆ టీం సొంతం. అలాంటి టీం ముందు 200 లక్ష్యమైనా చిన్న బోవాల్సిందే.. పైగా రాజస్థాన్ రాయల్స్ ను ఫైనల్ చేర్చి.. ఐపీఎల్ లోనే అత్యధిక పరుగులు చేసిన జోస్ బట్లర్ ఇప్పుడు ఇంగ్లండ్ కెప్టెన్. దీంతో టీమిండియాకు టీ20 సిరీస్ చాలా కష్టం అని అంతా అనుకున్నారు.
Also Read: Modi Friendship: మోడీతో స్నేహం చేస్తే గోవిందా.. ఇదిగో ఫ్రూఫ్
కానీ ట్రైయిన్ రివర్స్ అయ్యింది. ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీ20లో మ్యాచ్ లో భారత్ ఏకంగా 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఇంత చేసినా ఇంగ్లండ్ ముందు ఈ లక్ష్యం చిన్నగానే కనిపించింది. ఎందుకంటే ఆ టీంలో భీకర హిట్టర్లు ఉన్నారు. పైగా జోస్ బట్లర్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. క్రీజులో ఉంటే బట్లర్ ఎంత పెద్ద లక్ష్యమైనా ఊదేస్తాడు.

కానీ మన భువనేశ్వర్ ముందు బట్లర్ పప్పులు ఉడకలేదు. అద్భుతమైన ఇన్ స్వింగర్ డెలివరీకి పరుగుల ఖాతా కూడా తెరవకుండా ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ గోల్డెన్ డక్ ఔట్ కావడం సంచలనమైంది. అంతటి భారీ బ్యాట్స్ మెన్ ను మన భువి అత్యంత నాణ్యమైన స్వింగ్ బంతితో ఔట్ చేసిన తీరు వైరల్ అయ్యింది. ఆ బంతి పడ్డాక తిరిగిన విధానం.. బౌల్డ్ చేసిన వీడియో చూసి ఇఫ్పుడు అందరూ భువిని ప్రశంసిస్తున్నారు. భువనేశ్వర్ ది ‘ ఏం స్వింగ్ రా బాబూ’ అంటూ కొనియాడుతున్నారు.
Also Read:Revanth Reddy: రేవంత్ మరో రాజశేఖర్ రెడ్డి అవుతారా?
BOWLED!
Bhuvneshwar Kumar gets the big wicket, Jos Buttler gone for duck 🙌 #ENGvIND pic.twitter.com/NClQLHXFgp
— Doordarshan Sports (@ddsportschannel) July 7, 2022