BGT 2023 Aus vs IND Test Series : మ్యాచ్ స్ట్రాట్ యే కాలేదు.. అప్పుడే నాగపూర్ పిచ్ పై లొల్లి షురూ చేసిన ఆస్ట్రేలియా మాజీలు-మీడియా

BGT 2023 Aus vs IND Test Series : పిల్ల పుట్టకముందే కుల్లకుట్టిన శాత్రంగా మారింది ఈ ఆస్ట్రేలియా వాళ్ల పరిస్థితి. నాగపూర్ లో తొలిటెస్ట్ ఇంకా ప్రారంభం కాకముందే అప్పుడే ఓటమి భయంతో పిచ్ పై కారు కూతలు కూరుస్తున్నారు. అటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇటు మీడియా నాగపూర్ పిచ్ ను మ్యానికులేట్ చేస్తున్నారంటూ పిచ్ పై జరుగుతున్న కసరత్తు ఫొటోలను షేర్ చేస్తూ గగ్గోలు పెడుతున్నారు. ఓడిపోతామన్న భయంతోనే ఇలా చేస్తున్నారని భారత మాజీలు […]

Written By: NARESH, Updated On : February 8, 2023 9:53 pm
Follow us on

BGT 2023 Aus vs IND Test Series : పిల్ల పుట్టకముందే కుల్లకుట్టిన శాత్రంగా మారింది ఈ ఆస్ట్రేలియా వాళ్ల పరిస్థితి. నాగపూర్ లో తొలిటెస్ట్ ఇంకా ప్రారంభం కాకముందే అప్పుడే ఓటమి భయంతో పిచ్ పై కారు కూతలు కూరుస్తున్నారు. అటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇటు మీడియా నాగపూర్ పిచ్ ను మ్యానికులేట్ చేస్తున్నారంటూ పిచ్ పై జరుగుతున్న కసరత్తు ఫొటోలను షేర్ చేస్తూ గగ్గోలు పెడుతున్నారు. ఓడిపోతామన్న భయంతోనే ఇలా చేస్తున్నారని భారత మాజీలు ఓవైపు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా ఆస్ట్రేలియా వాళ్లు పిచ్ పై వివాదాన్ని రాజేసి ఓడిపోతే దానిమీద తోసేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

నాగ్‌పూర్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్ సమీపిస్తున్న తరుణంలో, భారత క్యూరేటర్లు మ్యాచ్‌కు రెండు రోజుల ముందు మాత్రమే పిచ్‌ను సిద్ధం చేయడంలో ప్రత్యేకమైన వ్యూహాన్ని ఉపయోగించినట్లు సమాచారం. ఇది ఆటగాళ్లు – అభిమానులలో ప్రశ్నలు లేవనెత్తిస్తోంది. ఆందోళనలకు దారితీస్తోంది.

నాగ్‌పూర్ వికెట్ మధ్యలో నీరు పోసి రోల్ అయిందని, బౌలర్లు ఎడమచేతి వాటం ఆటగాళ్లను లక్ష్యంగా బంతి తిరిగేలా రోల్ చేస్తున్నారని ఆన్-ది-గ్రౌండ్ రిపోర్టర్లు నివేదించారు. డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా , ఆస్ట్రేలియన్ జట్టుకు చెందిన ట్రావిస్ హెడ్ వంటి ఎడమచేతి వాటం ఆటగాళ్లకు ఆడడం కష్టతరం చేయడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంలో వికెట్ స్వరూపం మార్చారని ఆస్ట్రేలియా మీడియా-మాజీలు ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు నాగపూర్ పిచ్ ను సిద్ధం చేస్తున్న ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేసి రచ్చ చేస్తున్నారు. పిచ్ మధ్యలో మరింత పచ్చగా.. కుడిచేతి వాటం ఆటగాళ్లకు మంచి పొడవుతో అనుకూలంగా తీర్చిదిద్దారని అంటున్నారు. కానీ మరొక ఎడమ వైపు పొడిగా ఉందని.. గ్రౌండ్‌స్టాఫ్ ఉపరితలం మొత్తం మధ్యభాగాన్ని మరియు ఎడమచేతి వాటం లెగ్ స్టంప్ వెలుపల ఉన్న పొడవు ప్రాంతాలను మాత్రమే నీరుపోసి ఏదో మ్యాజిక్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిసారీ చిన్నగా ఆగి, మధ్యలో మాత్రమే చుట్టేస్తున్నారని అంటున్నారు.

-నాగ్‌పూర్ పిచ్‌పై ఆస్ట్రేలియా స్పందన
నాగపూర్ పిచ్ పై ఆస్ట్రేలియా జట్టు తమ ఆందోళనను వ్యక్తం చేసింది. స్టీవ్ స్మిత్ వికెట్ గురించి మాట్లాడుతూ “ఇది చాలా పొడిగా ఉంది. ముఖ్యంగా ఒక చివర ఇలా ఉంది. దీనికి కొంచెం స్పిన్ పడుతుందని నేను భావిస్తున్నాను. ప్రత్యేకించి ఎడమ చేతి స్పిన్నర్లు దానిని మా ఎడమ చేతికి తిరిగి తిప్పుతారు. నేను దానిపై మంచి గేజ్‌ని పొందలేను. నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ సీమర్‌లకు వికెట్‌లో బౌన్స్ లేదని నేను భావిస్తున్నాను. చాలా స్కిడ్‌గా ఉంటుంది. ఆట సాగుతున్నప్పుడు పగుళ్లు చాలా వదులుగా అయ్యి ఏడమచేతి స్పిన్ ఆడడం కష్టమవుతుంది’ అని పేర్కొన్నారు.

రవిచంద్రన్ అశ్విన్ -రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్ లాంటి టీమిండియా స్పిన్ ఎంపికలను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా కష్టపడడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. ఆస్ట్రేలియన్ ప్లేయింగ్ 11లో లెఫ్ట్ హ్యాండర్ లు ఎక్కువగా ఉన్నారు. ఇది పిచ్‌పై వారికి ప్రతికూలతను కలిగిస్తుందని అంటున్నారు. అయితే, మంచి ఫామ్‌లో ఉన్న , స్పిన్‌లో బలమైన ఆటగాడు కుడిచేతి వాటం పీటర్ హ్యాండ్‌కాంబ్ పరిస్థితుల నుండి ప్రయోజనం పొందవచ్చని చెబుతున్నారు.

-ఛాలెంజ్‌ని స్వీకరించడం
పిచ్ పొడిగా , స్పిన్‌ను తీసుకునేలా కనిపిస్తోందని క్షేత్రస్థాయిలో చూసిన మాజీలు, నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతకాలంగా స్పిన్‌కు వ్యతిరేకంగా ఫాస్ట్ బౌలింగ్ తో విజయాల బాటలో పన్నాగం పన్నుతున్న ఆస్ట్రేలియన్లకు ఇది ఊహించని సంఘటన. ఆస్ట్రేలియా ఫాస్ట్ పిచ్ లు రూపొందించి టీమిండియా సహా ఇతర టీంలను ఓడిస్తుంది. మన దేశంలో స్పిన్ వికెట్ తయారు చేస్తే మాత్రం ఇలా గగ్గోలు పెడుతుంటుంది. ఆస్ట్రేలియా తరుఫున భారత్‌లో టెస్టు సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్ స్టీవ్ స్మిత్, పిచ్‌పై ఫస్ట్ లుక్ తర్వాత కూడా తమ విధానం మారదని అతను చెప్పాడు.

అయితే ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా, విదేశీయులే కాదు స్పిన్ ఆడడానికి టీమిండియా ఆటగాళ్లు తండ్లాడుతున్నారు. మొన్న న్యూజిలాండ్ స్పిన్నర్లు భారత్ ను ముప్పుతిప్పలు పెట్టారు. లక్నో వికెట్ పై గెలవడానికి మనవాళ్లు ఎంత తండ్లాడారో చూశాం. సో స్పిన్ వికెట్ చేస్తే ఆస్ట్రేలియన్లకే కాదు.. భారత్ కే ముప్పు. ఈ చాలెంజ్ లో ఎవరు గెలుస్తారన్నది రేపటి మ్యాచ్ లో చూడాల్సిందే.