Suryakumar Yadav handshake snub: క్రికెట్ నిబంధనల ప్రకారం గెలిచిన జట్టుకు ఓడిన జట్టు షేక్ హ్యాండ్ ఇవ్వాలి. కానీ ఆదివారం నాటి మ్యాచ్లో అలా జరగలేదు. టీమ్ ఇండియా సారథి ఏ మాత్రం మొహమాటం లేకుండానే గెలిచిన తర్వాత తోటి ఆటగాడితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. వాస్తవానికి సూర్య కుమార్ యాదవ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వాలని పాకిస్తాన్ ఆటగాళ్లు ఆశపడ్డారు. కానీ వారి ఆశ నెరవేరలేదు. పైగా అత్యంత దారుణంగా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయి.. పాకిస్తాన్ ప్లేయర్ల ముఖం మీదనే డోర్ వేశాడు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో తెగ సర్కులేట్ అవుతోంది. ఈ వీడియో ఇప్పటికే లక్షలాది వీక్షణలు సొంతం చేసుకుంది. వాస్తవానికి ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత ప్లేయర్లు కచ్చితంగా కరచాలనం చేసుకుంటారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఈ స్ఫూర్తి ఇంకా ఇంకా కొనసాగించాలని బయటికి చెప్పుకుంటారు. ఎందుకంటే జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ లో ఇటువంటి వాతావరణ ముందు కాబట్టి ఆ క్రీడకు ఆ స్థాయిలో గౌరవం ఉంది. పైగా ఇలా పరస్పరం విజేతలు, పరాజితులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు కాబట్టి క్రికెట్ కు జెంటిల్మెన్ గేమ్ అనే పేరు వచ్చింది.
సూర్య కుమార్ యాదవ్ పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం పట్ల రకరకాల విశ్లేషణలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నప్పటికీ.. అంతిమంగా మాత్రం పాకిస్తాన్ పరువు పోతోంది. పాకిస్తాన్ ప్లేయర్లు టీమిండియాను సవాల్ చేసే స్థితిలో లేకపోవడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి పాకిస్తాన్ జట్టు కనుక గట్టి పోటీ ఇచ్చినట్టు ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని.. అలా చేయకపోవడం వల్లే టీమిండియా సారధి మొహమాటం లేకుండా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది జరగడం వెనక ఒక పెద్ద స్టోరీ ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మ్యాచ్ గెలిచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని టీం ఇండియా ప్లేయర్లు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అదే కాదు మేనేజ్మెంట్ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని.. కేవలం ఆటకు మాత్రమే పరిమితం కావాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదని సంకేతాలు వచ్చాయని తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే ప్లేయర్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేశారని.. అందువల్లే టీం ఇండియా విజయం సాధించిందని విశ్లేషకులు అంటున్నారు. గెలిచిన తర్వాత మన దేశ సైనికులకు, ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళిగా టీమిండియా క్రికెటర్లు ఈ గెలుపును అంకితం చేశారు.