Mohammed Shami: వరల్డ్ కప్ లో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూ తనదైన రీతిలో బౌలింగ్ చేస్తూ ఇండియన్ టీం కి మంచి విజయాలు అందిస్తున్న బౌలర్లలో మహమ్మద్ షమీ ఒకరు…ఆయన ఆడిన రెండు మ్యాచ్ ల్లో 9 వికెట్లు తీసి ప్రస్తుతం ఇండియన్ టీం తరఫున కీలకమైన బౌలర్ గా మారాడు. న్యూజిలాండ్ మీద జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమవడంతో ఆయన ప్లేస్ లో ఎక్స్ ట్రా పేసర్ గా షమీ ని తీసుకోవడం జరిగింది.
ఆ మ్యాచ్ లో 5 వికెట్లు తీసి న్యూజిలాండ్ బౌలర్లపై తన సత్తా ఏంటో చూపించాడు. ఇంగ్లాండ్ మ్యాచ్ లో కూడా మహమ్మద్ షమిని తుది జట్టులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో కూడా 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ప్లేయర్లు లక్ష్యాన్ని చేరుకోకుండా ఇంగ్లాండ్ టీమ్ ఆశలపై నీళ్లు చల్లాడు…అలా ఆడిన రెండు మ్యాచ్ ల్లోనే 9 వికెట్లు తీసి షమీ అద్భుతమైన బౌలర్ గా గుర్తింపు పొందాడు.అయితే షమీ ఇంత మంచి ఫామ్ వెనక చాలా కష్టాలు దాగి ఉన్నాయి. తను ఎంతో ఇష్టం గా పెళ్లి చేసుకున్న తన భార్య నుంచి తను తీసుకోవడం తీసుకున్నాడు ఇక చెయ్యని తప్పులకు శిక్ష అనుభవించడం జరిగింది. ఇక దీని తర్వాత ఆయన జీవితంలో చాలా వరకు రాటుదేలాడు. ఇలాంటి సమయంలో తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అంటే మళ్ళీ క్రికెట్ ని అద్భుతంగా ఆడాలి అనే ఒకే ఒక ఉద్దేశ్యం తో బౌలింగ్ లో పదును పెట్టి ఒకటికి 10 సార్లు ప్రాక్టీస్ చేస్తూ టీంలో చోటు దక్కించుకున్నాడు.
ఇక అందులో భాగంగానే ఆయన వేసిన ప్రతి బాల్ కూడా ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ని తీవ్రంగా భయపెడుతుంటాయి.ఇక ఈ వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ ల్లోనే 9 వికెట్లు తీయడం అంటే మామూలు విషయం కాదు.ఆ ఘనతను సాధించిన ఇండియన్ ప్లేయర్ గా షమీ మంచి గుర్తింపు పొందాడు. ఇక ప్రతి మనిషి విజయం వెనకాల కూడా చాలా కష్టం దాగి ఉంటుంది అనేది చాలామంది చెప్తూ ఉంటారు. కానీ షమీ జీవితాన్ని చూస్తే మాత్రం అది మనకు కండ్లకి కట్టినట్టుగా కనిపిస్తుంది.ఇక ఇబ్బందులను ఎదుర్కొని తనను తాను ప్రూవ్ చేసుకొని ఇండియన్ టీం లో మంచి బౌలర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక మీదట జరగబోయే మ్యాచ్ ల్లో కూడా షమీ కీలకమైన పాత్ర పోషించబోతున్నాడనే విషయమైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈసారి ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ కొట్టి తనదైన సత్తా చూపించుకోవాలని చూస్తుంది…