IPL 2024: ప్రపంచంలో ఉన్న ప్రతి క్రికెట్ అభిమానికి ఇష్టమైన లీగ్ ఐపీఎల్… ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఈ ఐపిఎల్ లో ఆడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక అత్యంత ఖరీదైన లీగ్ గా కూడా ఐపీఎల్ పేరు సంపాదించుకుంది. ఇక ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఐపిఎల్ 17 సీజన్ కి గాను షెడ్యూల్ ని రెడీ చేయడానికి బిసిసిఐ నానా తంటాలు పడుతుంది. కారణం ఏంటి అంటే ఇండియాలో లోక్ సభ ఎన్నికలు ఉండడం వల్లే ఐపీఎల్ ని నిర్వహించడానికి ఇబ్బంది కలుగుతుంది.
ఇక ఐపిఎల్ కి ఎన్నికలకు మధ్య క్లాషేస్ ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని బిసిసిఐ ఇప్పటి వరకు ఇంకా ఐపిఎల్ షెడ్యూల్ ని రిలీజ్ చేయలేదు. నిజానికైతే ఇప్పటికీ ఎప్పుడో ఐపీఎల్ షెడ్యూల్ ని రిలీజ్ చేయాల్సింది. కానీ ఎన్నికలకు సంబంధించిన డేట్ ఇంకా రాకపోవడంతో బిసిసిఐ కూడా ఐపీఎల్ షెడ్యూల్ ని రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం బిసిసిఐ ఐపీఎల్ ని రెండు దశల్లో నిర్వహించేలా ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కొన్ని మ్యాచ్ లను విదేశాల్లో నిర్వహించి, మరికొన్ని మ్యాచ్ లను ఇండియా లో నిర్వహించాలని చూస్తుంది. ఇక అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలను కూడా రూపొందిస్తుంది.
అయితే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీని ప్రకటిస్తే దాన్ని బేస్ చేసుకొని బీసీసీఐ ఏ మ్యాచ్ లను విదేశాల్లో ఆడాలి, ఏ మ్యాచ్ లు ఇండియాలో నిర్వహించాలి అనే దానిమీద ఒక క్లారిటీతో షెడ్యూల్ ని ప్లాన్ చేయాలని చూస్తుంది. నిజానికైతే బిసిసిఐ మార్చి 22 నుంచి మే 26వ తేదీ వరకు ఈ లీగ్ ని నిర్వహించాలని అనుకుంది. కానీ ఎలక్షన్ల వల్ల కొంతవరకు ఈ డేట్లు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మొత్తానికైతే క్రికెట్ అభిమానులు ఐపీఎల్ షెడ్యూల్ కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ ఎలక్షన్స్ జరిగే డేట్ ని అనౌన్స్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని తొందర్లోనే బిసిసిఐ ఐపీఎల్ షెడ్యూల్ ని ఫైనల్ చేసి అనౌన్స్ చేయనున్నట్టుగా తెలుస్తుంది…