BCCI New Rules : పది పాయింట్ల నిబంధనలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయంపై అజిత్ అగార్కర్ స్పష్టత ఇవ్వగా.. ఇదే విషయంపై విలేకరులు అడిగితే కెప్టెన్ రోహిత్ శర్మ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అయితే ఈ పది పాయింట్ల నియమావళి అందుబాటులోకి వచ్చిందా? లేదా? అనే విషయంపై ఇంతవరకు స్పష్టత రాలేదు. మరోవైపు దీనిపై బీసీసీఐ కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు.. బీసీసీఐ చెప్పకపోయినప్పటికీ, అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ.. ఇది అమల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది.. ఇందులో భాగంగానే బీసీసీఐ జట్టు ఆటగాళ్ల ప్రయాణాలపై కాంక్షలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఆటగాళ్లకు వ్యక్తిగత వాహనాలను సమకూర్చలేదు. ఒకే బస్సులో ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. “ప్రాక్టీస్ సెషన్ మొదలుపెట్టే సమయానికి ప్లేయర్లు మొత్తం గ్రౌండ్లో రెడీగా ఉండాలి. అక్కడి నుంచి వారు స్టే చేసే హోటల్లోకి యూనిటీగా వెళ్లాలని” బీసీసీఐ(BCCI) నిబంధనలు రూపొందించింది.. అంతేకాదు త్వరలో జరిగే ఇంగ్లాండ్ సిరీస్ కు ఆతిథ్యం ఇచ్చే వివిధ రాష్ట్రాల క్రికెట్ బోర్డు సంఘాలకు కూడా బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఆదేశాలు జారే
ఇప్పటికే ఈ ఆదేశాలను ఇంగ్లాండుతో జరిగే తొలి టి20కి ఆతిధ్యం ఇస్తున్న కోల్ కతా(cricket association of Bengal) కు బీసీసీఐ అందజేసింది.. తొలి టీ 20 మ్యాచ్ కోసం భారత్ – ఇంగ్లాండ్ చెట్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. తొలి మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఒకే బస్సులో అక్కడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలోనూ అదే విధంగా చేశారు. ” ఒక బస్సును మాత్రమే ఏర్పాటు చేశాం. అందులోనే ఆటగాళ్లు, ఇతర సిబ్బంది వెళ్లారు. వ్యక్తిగత వాహనాలు ఉన్నప్పటికీ ఏ ఆటగాడికి కూడా ఆ సౌకర్యం కల్పించలేదు. బిసిసిఐ తీసుకొచ్చిన 10 పాయింట్ల నిబంధనను కచ్చితంగా అమలు చేశాం. దీనికంటే ముందు మాకు బీసీసీఐ నుంచి వర్తమానం అందింది. దాని ప్రకారమే మేము నడుచుకున్నాం. గతంలో కోల్ కతా మైదానంలో టోర్నీలు జరిగినప్పుడు ఆటగాళ్ల కోసం వ్యక్తిగత వాహనాలను సమకూర్చే వాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కచ్చితంగా కొత్త నిబంధనకే మేము కట్టుబడి ఉన్నాం. దానినే అమలు చేశాం. అంతే తప్ప ఇందులో మా వ్యక్తిగత ఉద్దేశాలు లేవని” బెంగాల్ క్యాబ్ అధ్యక్షుడు స్నేహశీష్ గంగూలీ పేర్కొన్నాడు. అయితే ఇటీవల 10 పాయింట్లు నిబంధన విషయంలో కొంతమంది ఆటగాళ్ల నుంచి అంతర్గతంగా నిరసన వ్యక్తమైనప్పటికీ.. ఆటగాళ్ల నిరసనలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా బీసీసీఐ ఆ నిబంధనలను నిక్కచ్చిగా అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.