BCCI 10 point disciplinary
BCCI : ఆటగాళ్లు గత నాలుగు నెలలుగా దారుణమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నారు. తద్వారా టెస్టులలో టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టుగా అపకీర్తిని మూటగట్టుకుంది. న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టులలో స్వదేశంలో వరుసగా ఓడిపోయింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి వైట్ వాష్ కు గురైన అపకీర్తిని మూటగట్టుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో విఫల ప్రదర్శన చేసింది. ఏకంగా మూడు టెస్టులలో ఓడిపోయి పరువు తీసుకుంది. కేవలం ఒకే ఒక టెస్టులో విజయం సాధించి.. కంగారుల చేతిలో తల వంపులకు గురైంది. ఈ ఓటముల పరంపర ఇలా కొనసాగుతుండగానే ఆటగాళ్ల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. డ్రెస్సింగ్ రూమ్ లో అలకలు మొదలయ్యాయి. చివరికి అవి సిడ్ని టెస్ట్ కు రోహిత్ శర్మను దూరం చేశాయి. ఇవన్నీ కూడా భారత జట్టు పరువును తీస్తున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ (team India captain Rohit Sharma).. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(head coach Gautam Gambhir), బీసీసీఐ బోర్డు మెంబర్స్ (BCCI board members) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గౌతమ్ గంభీర్.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PowerPoint presentation) ఇచ్చాడు.. వీటన్నిటినీ కూడా బీసీసీఐ పరిగణలోకి తీసుకుంది. తెరపైకి పది పాయింట్లు పాలసీని (10 point disciplinary policy) తీసుకొచ్చింది.
ఆ పది పాయింట్లు ఏంటంటే
బీసీసీఐ తెరపైకి తీసుకొచ్చిన 10 పాయింట్ల ప్రకారం.. క్రికెటర్లు మొత్తం ఆ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. దీనికి ఎవరూ అతీతులు కాదు. దేశవాళీ టోర్నీలో ప్రతి ఒక్క క్రికెటర్ కచ్చితంగా ఆడాల్సి ఉంటుంది.. అందులో చూపించిన ప్రదర్శన ఆధారంగానే తదుపరి టోర్నీలకు పరిగణలోకి తీసుకుంటుంది.
దేశవాళీ క్రికెట్ టోర్నీల వల్ల స్టార్ ఆటగాళ్లు లోకల్ యూత్ తో ఆడే అవకాశం ఉంటుంది. అంతేకాదు వారి అనుభవాన్ని లోకల్ యూత్, లోకల్ యూత్ దూకుడును స్టార్ ఆటగాళ్లు నేర్చుకుంటారు.
ఆటగాళ్లు మొత్తం ఎట్టి పరిస్థితుల్లో సంయుక్తంగా ప్రయాణించాలి. దీనివల్ల ఆటగాళ్ల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయి. ఒకవేళ కుటుంబంతో కలిసి ప్రయాణించాలంటే ముందస్తుగా చీఫ్ కోచ్ లేదా సెలక్షన్ కమిటీ అనుమతి తీసుకోవాలి.
బ్యాగేజీ విషయంలోనూ ప్లేయర్లు నిబంధనలు పాటించాలి. పరిమితికి మించి బరువు ఉంటే దానికి అయ్యే మొత్తాన్ని కూడా ప్లేయర్ భరించాలి.. దీనివల్ల అదనపు ఖర్చులు తగ్గుతాయి.
గతంలో ప్లేయర్లు వ్యక్తిగత మేనేజర్ లను, చెఫ్స్, అసిస్టెంట్స్, సెక్యూరిటీని ఆయా పర్యటనలకు తీసుకొచ్చేవాళ్ళు. అయితే దీనిపై బోర్డు కఠినమైన నిబంధనలు విధించింది. బోర్డు అంగీకారం లేకుండా ఇకపై ఇవి జరగవు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రాక్టీస్ ముగిసే వరకు ప్లేయర్లు మొత్తం ఉండాల్సిందే. ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే హోటల్ రూమ్ లకు వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటారు. అందరూ ఒకేసారి హోటల్ రూమ్ లకు వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల ప్లేయర్ల మధ్య మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి.
విదేశీ పర్యటన సమయంలో ప్లేయర్లు వ్యక్తిగత షూటింగ్ లేదా ఎండార్స్మెంట్ లో పాల్గొనేందుకు అవకాశం లేదు.. భారత్ అవతల 45 రోజుల కంటే ఎక్కువగా ఉండే టూర్లలో రెండు వారాలపాటు ప్లేయర్ల కుటుంబ సభ్యులకు అవకాశం ఉంటుంది. ప్లేయర్ తోపాటు కుటుంబ సభ్యులకు బిసిసిఐ షెల్టర్ ఇస్తుంది. మిగతా మొత్తం ప్లేయర్ భరించాల్సి ఉంటుంది. అయితే ఆ టూర్ మొత్తం మీద ఒకసారి మాత్రమే ప్లేయర్ కు ఈ అవకాశం ఉంటుంది. ఒకవేళ అత్యవసరమైతే కోచ్, కెప్టెన్, ఆపరేషన్స్ జిఎం అనుమతి కంపల్సరీ తీసుకోవాలి.
బీసీసీఐ నిర్వహించే అధికారిక షూటింగ్ కార్యక్రమాలకు ప్లేయర్లు మొత్తం ఎప్పటికీ అందుబాటులో ఉండాలి.. క్రికెట్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ చేస్తుంది కాబట్టి కచ్చితంగా సహకరించాలి. షెడ్యూల్ కంటే ముందే మ్యాచులు ముగిస్తే.. సిరీస్ లు అయిపోతే.. ఆటగాళ్లు ముందే బయలుదేరి వెళ్లాల్సిన అవసరం లేదు. అందరూ ఒకేసారి, ఒకే సమయంలో ప్రయాణించాల్సి ఉంటుంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Bcci has brought 10 points to the fore starting with the purge in team india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com