IPL dot ball trees initiative: ఐపీఎల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కార్పొరేట్ క్రీడ. కోట్లకు కోట్లు పెట్టి ప్లేయర్లను కార్పొరేట్ కంపెనీలు కొనుగోలు చేస్తాయి. ప్రసార హక్కుల నుంచి మొదలుపెడితే.. జెర్సీల అమ్మకం వరకు ప్రతిదీ కోట్లతోనే ముడిపడి ఉంటుంది. అందువల్లే ఐపిఎల్ ను కార్పొరేట్ క్రీడ అని పిలుస్తుంటారు. కానీ దీని వెనక కూడా ఒక గట్టి సంకల్పం దాగింది.
ఐపీఎల్ లో ప్లేయర్లు బీభత్సంగా బ్యాటింగ్ చేస్తుంటారు. పరుగుల వరద పారిస్తూ ఉంటారు. సిక్సర్ల మీద సిక్సర్లు.. ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఐపీఎల్ లో డాట్ బాల్ పడితే.. దానికి ఎటువంటి సార్ధకత చేకూర్చాలి అనే చర్చ అప్పట్లో జరిగింది. వాస్తవానికి ఐపీఎల్లో డాట్ బాల్ అంటేనే గొప్ప ఘనత. ఎందుకంటే బంతిని కనపడితే చాలు గట్టిగా కొట్టాలని ప్రతి ఆటగాడు అనుకుంటాడు. అందువల్లే డాట్ బాల్ వేసే బౌలర్లకు గుర్తింపు తీసుకురావాలని ఐపిఎల్ నిర్వాహక కమిటీ అప్పట్లో భావించింది. అది కాస్త పచ్చటి సంకల్పానికి దారితీసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రతి డాట్ బాల్ కు మొక్కలు నాటే కార్యక్రమాన్ని 2023లో ఐపీఎల్ నిర్వాహక కమిటీ మొదలుపెట్టింది. దీని వెనక పిసిసిఐ ఉంది. ముందుగా ప్లే ఆఫ్ లో డాట్ బాల్ కు 500 చొప్పున మొక్కలను నాటాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత లీగ్ మ్యాచ్ లకు కూడా దీనిని విస్తరింపజేశారు. ప్రస్తుతం ఐపీఎల్ 19వ సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి డాట్ బాల్ కు 19 మొక్కలను బిసిసిఐ నాటుతోంది. ఇప్పటివరకు ప్రత్యేకంగా ప్లాంటేషన్ నర్సరీలు.. క్రికెటింగ్ సౌకర్యాల వద్ద ఆరు లక్షలకు పైగా మొక్కలు నాటింది. టాటా గ్రూపు ఈ హరిత సంకల్పానికి సహకరిస్తుంది. వాస్తవానికి ప్రపంచంలో ప్రీమియర్ లీగ్ లు చాలా వరకు కొనసాగుతున్నాయి. కానీ ఏ యాజమాన్యం కూడా ఇలా మొక్కలు నాటిన చరిత్ర లేదు.
ప్రీమియర్ లీ క్రికెట్ చరిత్రలో బిసిసిఐ మాత్రమే ఈ హరిత సంకల్పానికి శ్రీకారం చుట్టింది. అందువల్లే మొక్కలను ఈ స్థాయిలో నాటుతోంది. ఈ మొక్కల వల్ల పర్యావరణానికి తన వంతుగా సహకారం అందిస్తోంది బీసీసీఐ, టాటా కంపెనీ. మొక్కలను నాటడం మాత్రమే కాదు.. వృక్షాలుగా ఎదిగేందుకు కూడా తోడ్పాటు అందిస్తోంది టాటా కంపెనీ.