Homeక్రీడలుక్రికెట్‌BCCI Big Plan To Win T20 World Cup Final: టి20 వరల్డ్ కప్...

BCCI Big Plan To Win T20 World Cup Final: టి20 వరల్డ్ కప్ గెలవడానికి బీసీసీఐ పెద్ద స్కెచ్చే వేసిందిగా

BCCI Big Plan To Win T20 World Cup Final: టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మరికొద్ది క్షణాల్లో మొదలు కాబోతోంది. అహ్మదాబాద్ మైదానం ప్రేక్షకుల రాకతో కిటకిటలాడుతోంది. సూపర్ 8 పోరులో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి ఎదురైన తర్వాత.. టీమిండియా తన పోరాటంలో మరింత జోరు చూపించింది. జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లపై వరుస విజయాలు సాధించింది. తద్వారా వరుసగా రెండోసారి ఫైనల్ చేరుకుంది.

Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!

ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టును ఢీకొట్టబోతోంది. ఈ క్రమంలో రెండోసార వరుసగా t20 వరల్డ్ కప్ టీమిండియా సాధించడానికి బీసీసీఐ బలమైన ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో బిసిసిఐ అనేక చర్యలు తీసుకుంది. టీమిండియా ప్లేయర్లు బస చేసే హోటల్ ను మార్పు చేసింది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్.. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా ఇదే హోటల్లో గడిపింది. అయితే ఆ హోటల్ కలిసి రాకపోవడంతో.. రెండు కీలక మ్యాచ్లలో టీమిండియా ఓటమిపాలైందని బిసి సిఐ గుర్తించింది. అందువల్లే ఈసారి హోటల్ గదిని పూర్తిగా మార్చేసింది.

2023 నుంచి 2026 ఇప్పటివరకు ఐసీసీ టోర్నీలలో టీమిండియా 32 మ్యాచ్లు ఆడింది. ఇందులో 30 మ్యాచ్లలో గెలిచింది. కేవలం రెండిట్లో మాత్రమే ఓడిపోయింది. ఆ రెండు కూడా అహ్మదాబాద్ వేదికగా జరిగినవి కావడం విశేషం.. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్.. 2026 t20 వరల్డ్ కప్ లో సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది.

టీమిండియా కు దురదృష్టకరమైన మైదానంగా పేరు పొందిన అహ్మదాబాద్ లో పిచ్ ను మొత్తం మార్చుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడో నంబర్ పిచ్ వాడుతున్నట్టు సమాచారం. పిచ్ ను మొత్తం నల్లమట్టితో నింపేసినట్టు తెలుస్తోంది. బ్లాక్ సాయిల్ పిచ్ మీద భారీగా పరుగులు చేయడానికి అవకాశం ఉంటుంది. క్యూరేటర్ చెబుతున్న దాని ప్రకారం ఈ పిచ్ మీద యావరేజ్ స్కోర్ 200 వరకు ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే టీమిండియా, న్యూజిలాండ్ బ్యాటర్లు పండగ చేసుకుంటారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సెమి ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ మీద టీమిండియా ఏకంగా 250+ స్కోర్ చేసింది. ఒకవేళ అహ్మదాబాద్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తే మాత్రం.. టీమిండియా ఆ స్థాయిలో స్కోర్ చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version