Shubman Gill: మెడ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు టీమిండియా సారధి గిల్. ప్రస్తుతం అతడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కోల్ కతా టెస్ట్ లో గిల్ కు ఉన్నట్టుండి మెడ కండరాలు పట్టేశాయి. అతడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. మూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతడు.. ఏమాత్రం బ్యాటింగ్ చేసే సామర్థ్యం లేకపోవడంతో వెంటనే పెవిలియన్ వెళ్లిపోయాడు.
గిల్ ను వెంటనే మేనేజ్మెంట్ ఆసుపత్రికి తరలించింది. ఆ తర్వాత అతడిని ఐసీయూలోకి తీసుకెళ్లారు. దాదాపు అతడు నాలుగు రోజులపాటు చికిత్స పొందాడు. అనంతరం పరీక్షించిన వైద్యులు డిస్చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో అతడి ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఒక కీలక ప్రకటన చేశారు. అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని.. అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించడానికి కాస్త సమయం పడుతుందని వైద్యులు ప్రకటించారు. ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే రెండవ టెస్టు లో అతడు ఆడే అవకాశం లేదని వైద్యులు చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఆధుని ప్రయాణాలు చేయకూడదని వైద్యులు సూచించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రయాణం చేస్తే గాయం తీవ్రత పెరిగి దీర్ఘకాలిక సమస్యగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. మరోవైపు వైద్యులు చెప్పిన దాని ప్రకారం రెండో టెస్టులో అతడిని ఆడించాలా? వద్దా? అనే విషయంపై 21న మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వైద్యులు ఆస్థాయిలో సూచనలు చేసినప్పటికీ.. బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.. కోల్ కతా లో జరిగిన మొదటి టెస్టులో గిల్ మెడ కండరాలు పట్టేశాయి. మొదట్లో ఇది సాధారణ సమస్య అనుకున్నారు. కానీ ఆ తర్వాత అతని మెడకు గాయమైనట్టు పరీక్షల ద్వారా తెలిసింది. కొద్దిరోజులు అతడు చికిత్స పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం అతడు చికిత్సకు రెస్పాండ్ అవుతున్నాడు. శరీరం చురుగ్గా స్పందిస్తోంది. ప్రస్తుతం అతడు జట్టుతో కలిసి అస్సాం లోని గుహవాటి వెళ్లిపోయాడు. అతడు మెడికల్ పర్యవేక్షణలో ఉన్నాడు. అతని ఆరోగ్య స్థితిని బట్టి రెండో టెస్టులో ఆడించాలా? లేదా? అనే వాటిపై నిర్ణయం తీసుకుంటామని మేనేజ్మెంట్ ప్రకటించింది. మరోవైపు అతడి స్థానంలో సీనియర్ ప్లేయర్లను ఆడించాలని మాజీ క్రికెటర్లు కోరుతున్నారు.
వరుస టోర్నీలలో గిల్ ఆడటం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని అతడి అభిమానులు చెబుతున్నారు. వాస్తవానికి అతడికి రెస్ట్ ఇవ్వకుండా మేనేజ్మెంట్ ఇష్టానుసారంగా క్రికెట్ టోర్నీలు ఆడించడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురైందని.. అతడికి కాస్త విశ్రాంతి ఇచ్చి ఉంటే మెడ నొప్పి వచ్చి ఉండేది కాదని వారు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అయితే గిల్ మెడ నొప్పికి సంబంధించి స్పష్టమైన కారణాన్ని ఇంతవరకు బీసీసీఐ ప్రకటించకపోవడం విశేషం.