spot_img
Homeక్రీడలుక్రికెట్‌Bangalore Police IPL Free Ticket Prank: పోలీసుల ఉదారత.. లింక్ క్లిక్ చేస్తే ఉచితంగా...

Bangalore Police IPL Free Ticket Prank: పోలీసుల ఉదారత.. లింక్ క్లిక్ చేస్తే ఉచితంగా ఐపీఎల్ టికెట్లు..

Bangalore Police IPL Free Ticket Prank: ఐపీఎల్ మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. కొన్నింట్లో పరుగుల వరద పారితే.. మరికొన్నింట్లో వికెట్ల వేట సాగుతోంది. మొత్తంగా అభిమానులకు కావలసిన క్రికెట్ మజా మొత్తం లభిస్తోంది. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో సాయంత్రమైతే చాలు అందరూ టీవీ స్క్రీన్ లకు.. సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు.

Also Read: అట్లాంటాలో ‘తానా’ సి.పి.ఆర్ శిక్షణ కార్యక్రమం విజయవంతం

ఐపీఎల్ మానియా దేశం మొత్తాన్ని ఊపేస్తున్న నేపథ్యంలో.. బెంగళూరు పోలీసులు ఉదారత చూపించారు. ఉచితంగా ఐపీఎల్ టికెట్లు అంటూ ఒక లింక్ షేర్ చేశారు. పోలీసులు నేరుగా లింక్ షేర్ చేయడంతో.. వెంటనే అభిమానులు రెస్పాండ్ అయ్యారు. ఆ లింకు క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించారు. అభిమానులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ టికెట్లు బుక్ కావడం లేదు. పైగా ఆ లింకు క్లిక్ చేస్తే టికెట్ బుకింగ్ పేజీ కనిపించడం లేదు. పైగా యూజర్లను ఆ పేజీ డిజైనర్ స్క్రీన్ లోకి తీసుకెళ్తోంది. దానిమీద మీరు ఏప్రిల్ ఫూల్ అయ్యారు.. మిమ్మల్ని ఆటపట్టించామంటూ రాసి ఉంది.

సాధారణంగా అపరిచిత వ్యక్తులు పంపించిన లింకు మీద క్లిక్ చేస్తే నేరుగా మన వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది . సైబర్ నేరగాళ్లు ఒక్కసారి మనల్ని అటాక్ చేయడం మొదలుపెడితే ఆ తర్వాత పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. మన నగదును మొత్తం స్వాహా చేస్తారు. అంతేకాదు వ్యక్తిగత వివరాలను సేకరించి డబ్బు కోసం బెదిరింపులకు పాల్పడుతుంటారు. డబ్బులు ఇవ్వకపోతే. వ్యక్తిగత వీడియోలు.. ఇతర ఫోటోలు బయట పెడతామంటూ హెచ్చరిస్తారు.

సైబర్ నేరాల మీద అవగాహన కల్పించడానికి. అపరిచితమైన వ్యక్తులు లింకులు పంపిస్తే వాటిని క్లిక్ చేయకుండా ఉండడానికి బెంగళూరు పోలీసులు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. పైగా ఏప్రిల్ 1వ తేదీన.. ఫూల్ డే జరుపుకుంటారు. ప్రజలలో వినూత్నంగా అవగాహన కల్పించడానికి ఈ లింక్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చినట్టు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. బెంగళూరు పోలీసులు చేసిన ఈ ప్రయత్నం ప్రారంభంలో అభిమానుల నుంచి ఆగ్రహానికి కారణమైంది. ఆ తర్వాత పోలీసులు చేసిన మంచిని గుర్తించిన బెంగళూరు నగర ప్రజలు అభినందిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version