spot_img
Homeక్రీడలుక్రికెట్‌Delhi Capitals vs Lucknow: అక్షర్, కేఎల్ రాహుల్ తలవంచినా.. ఇతడు నిలబెట్టాడు.. ఢిల్లీ గెలుపులో...

Delhi Capitals vs Lucknow: అక్షర్, కేఎల్ రాహుల్ తలవంచినా.. ఇతడు నిలబెట్టాడు.. ఢిల్లీ గెలుపులో అదే కీలకం

Delhi Capitals vs Lucknow: పంజాబ్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో నమోదైన ఒక మోస్తరు స్కోరు మ్యాచ్ అభిమానులకు అద్భుతమైన క్రికెట్ మజాను అందించింది. ఆ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఉత్కంఠ పరిస్థితుల మధ్య విజయం సాధించింది. బుధవారం లక్నో, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా అదే స్థాయిలో సాగింది. అభిమానులకు అసలు సిసలైన టి20 క్రికెట్ ఆనందాన్ని అందించింది.. లో స్కోర్ నమోదైన ఈ మ్యాచ్లో.. రెండు జట్లు కూడా విజయం కోసం చివరి వరకు పోరాడాయి. చివర్లో ఢిల్లీ జట్టు కాస్త ఎక్కువ ప్రతిఘటించి విజయాన్ని అందుకుంది.

Also Read: అట్లాంటాలో ‘తానా’ సి.పి.ఆర్ శిక్షణ కార్యక్రమం విజయవంతం

ఈ మ్యాచ్లో ఫస్ట్ లక్నో జట్టు బ్యాటింగ్ చేసింది. ఢిల్లీ జట్టు బౌలర్ల దూకుడు ముందు లక్నో బ్యాటర్లు తలవంచారు. కనీసం పూర్తిస్తాయి ఓవర్లు కూడా ఆడ లేకపోయారు. 18.4 ఓవర్లలోనే 141 పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు. మార్ష్(35), అబ్దుల్ సమద్ (36) సత్తా చూపించలేకపోతే లక్నో జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఢిల్లీ జట్టులో ఎంగిడి 3, నట రాజన్ మూడు వికెట్లు పడగొట్టారు. కులదీప్ రెండు వికెట్లు సాధించాడు.
142 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన ఢిల్లీ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడింది. 0 పరుగులకే ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత నితీష్ రానా.. నిశాంక, అక్షర్ పటేల్ వికెట్ల కోల్పోవడంతో ఢిల్లీ జట్టు తీవ్రమైన ఇబ్బందుల్లో పడింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 2, షమీ ఒక వికెట్ పడగొట్టారు.

చేదించేది స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ.. 26 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన క్రమంలో.. ఢిల్లీ జట్టును స్టబ్స్(39*), సమీర్ రిజ్వి(70*) నిలబెట్టారు.. లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంక ముందు అక్షర్, కేఎల్ రాహుల్ పరువు పోకుండా కాపాడారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు ఏకంగా 76 బంతుల్లో 119 పరుగులను అజేయంగా నెలకొల్పారు. ఫలితంగా ఢిల్లీ జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది.. సమీర్, స్టబ్స్ ను ఔట్ చేయడానికి లక్నో జట్టు కెప్టెన్ పంత్ ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఉన్న బౌలర్లను మొత్తం ప్రయోగించాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

ఐపీఎల్ లో మూడు మ్యాచ్లలో భారీగా పరుగులు నమోదు అయ్యాయి. 200 కు మించిన పరులను చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడం ముందు బ్యాటింగ్ చేసిన జట్లకు సాధ్యం కాలేదు. అయితే.. పంజాబ్ వర్సెస్ గుజరాత్, ఢిల్లీ వర్సెస్ లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ బౌలర్లకు ప్యారడైజ్ లాగా మారింది. బౌలర్లు కూడా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంతో.. ఈ రెండు మ్యాచ్లు అభిమానులకు సరికొత్త క్రికెట్ ఆనందాన్ని అందించాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version