BAN vs PAK T20 Highlights: సరిగ్గా ఏడాది క్రితం స్వదేశం వేదికగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడింది. రెండు టెస్టులను ఓడిపోయింది. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా బంగ్లాదేశ్ వైట్ వాష్ తో సిరిస్ అందుకుంది. అంతేకాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ లో గౌరవప్రదమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. స్వదేశంలో అది కూడా తనకంటే చిన్న స్థాయిలో ఉన్న బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి పాకిస్తాన్ ఇజ్జత్ మొత్తం తీసుకుంది. అక్కడితోనే పాకిస్తాన్ పతనం అయిపోలేదు. స్వదేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగితే కనీసం గ్రూప్ దశ కూడా దాటలేదు. అంతకుముందు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తమ దేశంలో పర్యటించినప్పుడు.. ఏ మాత్రం ప్రతిఘటన కూడా ఇవ్వకుండా టెస్ట్ సిరీస్ ఓటమిని చవిచూసింది పాకిస్తాన్.
Also Read: వన్డే సిరీస్ విజయమే కాదు.. ఇంగ్లీష్ గడ్డపై హర్మన్ సేన సాధించిన రికార్డులు మామూలువి కావు
సుదీర్ఘ ఫార్మాట్లోనే కాదు.. చివరికి టి20 ఫార్మాట్ లోనూ పాకిస్తాన్ అత్యంత నిరాశ జనకమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నది. ఏ ప్రకారం చూసుకున్నా తనకంటే తక్కువ ర్యాంకు ఉన్న బంగ్లాదేశ్ పై గొప్పగా ఆడాల్సిన పాకిస్తాన్ చేతులెత్తేసింది. ఆ జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ల సిరీస్ ను పాకిస్థాన్ కోల్పోయింది.. మీరు పూర్ ప్రాంతంలో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 20 ఓవర్లను పూర్తి స్థాయిలో ఆడింది. పర్యటక జట్టు ఎదుట 134 రన్స్ టార్గెట్ విధించింది. ఆ జట్టులో మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు జాకీర్ అలీ 55, మెహదీ హసన్ 33 మాత్రమే పర్వాలేదు అనిపించారు. వాస్తవానికి టి20 లలో ఈ పరుగులు పెద్ద స్కోర్ కాదు. కానీ వీటిని చేదించడానికి పాకిస్తాన్ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడింది. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఆల్ అవుట్ అయింది. కేవలం 125 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. వాస్తవానికి 15 పరుగులకే పాకిస్తాన్ ఐదు వికెట్ల కోల్పోయింది. 88 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పహీం అష్రాఫ్ 51 పరుగులు చేసి జట్టు పరుగును ఆ కాస్తైన కాపాడగలిగాడు.
ఒకవేళ పహిం గనుక ఆడకపోయి ఉంటే పాకిస్తాన్ పరుగు మరింత దారుణంగా పోయేది. పాకిస్తాన్ ప్లేయర్లలో ఫకర్ జమాన్ 8, ఆయుబ్ 1, హరీస్ 0, సల్మాన్ ఆఘా 9, హసన్ నవాజ్ 0, మహమ్మద్ నవాజ్ 0, కుష్ దిల్ 13, అబ్బాస్ ఆఫ్రిది 19, అహ్మద్ డేనియల్ 17 పరుగులు చేశారు. వాస్తవానికి పాకిస్తాన్ జట్టులో ఏకంగా ముగ్గురు కీలకమైన ఆటగాళ్లు డక్ అవుట్ కావడం విశేషం.
Also Read: బద్దలవ్వడానికి 5 రికార్డులు సిద్ధం.. మాంచెస్టర్ లో టీమిండియా అద్భుతం చేస్తుందా?
ఇక ఈ ఓటమి ద్వారా పాకిస్తాన్ అత్యంత దారుణమైన రికార్డును నెలకొల్పింది. పాకిస్తాన్ ఇటీవల కాలంలో ఆడిన 31 t20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో కేవలం 8 మాత్రమే గెలిచింది. 23 మ్యాచ్లలో అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఐర్లాండ్ మీద రెండు, జింబాబ్వే మీద రెండు, కెనడా మీద ఒకటి, న్యూజిలాండ్ మీద ఒకటి మాత్రమే పాకిస్తాన్ గెలిచింది. పాకిస్తాన్ ఓటమి నేపథ్యంలో సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చివరికి బంగ్లాదేశ్ చేతుల్లో కూడా ఈ స్థాయిలో ఓడిపోవడం పట్ల దాయాది ఆటగాళ్లను ఆ జట్టు అభిమానులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మీరు క్రికెట్ ఆడటం మానేయాలంటూ హితవు పలుకుతున్నారు.