Pakistan ball tampering controversy: బురదలో బొర్లే వరాహానికి పన్నీరు ను చూపిస్తే ఎలా ఉంటుంది.. మళ్లీ బురదలోకే వెళ్తుంది. ఎందుకంటే ఎంతటి పన్నీరును చూపించినా వరాహం తన తీరు మార్చుకోదు. దాని జన్మతీరే అంత. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఈస్టోరీ చదవండి మీకే తెలుస్తుంది.
క్రికెట్ లో మిగతా ప్లేయర్లు ఒకవిధంగా ఆడితే.. పాకిస్థాన్ ప్లేయర్లు మరోవిధంగా ఆడతారు. తాము చెప్పిందే వేదం.. రాసిందే ధర్మం అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఐసీసీ నిబంధనలు పట్టించుకోరు. సొంత నిబంధనలు అమలు చేస్తారు. ఇదేంటని ఎవరని అడిగితే నోరు పారేసుకుంటారు.
అందువల్లే పాకిస్థాన్ క్రికెటర్లు ప్రతీసందర్భంలో అభాసుపాలవుతారు. ఇప్పుడు సోషల్ మీడియా విపరీతమైన ప్రాచుర్యంలో ఉండటంతో పాకిస్థాన్ క్రీడాకారుల లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ లో పాకిస్థాన్ సూపర్ లీగ్ నడుస్తోంది. ఈ లీగ్ లో భాగంగా ఆదివారం లాహోర్ ఖలందర్, కరాచీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ లో లాహోర్ ఆటగాడు ఫకర్ జమాన్ బంతినికి గోళ్లతో గిల్లాడు. ఆ వ్యవహారం మొత్తం కెమెరాలో రికార్డయింది. చివరి ఓవర్ లో కరాచీ జట్టు విజయానికి 14 పరుగులు అవసరం. అంపైర్ పైజల్ ఈదారుణాన్ని గమనించి బాల్ టాంపరింగ్ జరిగిందని గుర్తించారు. దీంతో కరాచీ జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు. అంతేకాదు బంతిని అప్పటికప్పుడు మార్చారు. దీంతో కరాచీ జట్టు ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.
పాకిస్థాన్ బౌలర్ చేసిన వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. క్రికెట్ అనేది జెంటిల్ మెన్ గేమ్ అని..ఇలాంటి వ్యక్తులను తీసుకుంటే ఇలాగే జరుగుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘క్రికెట్ లో క్రీడాస్ఫూర్తిని చూపించాలి. అనైతికమైన విధానాలకు పాల్పడకూడదు. ముఖ్యంగా మంచుకురుస్తున్నసమయంలో బంతిని గోర్లతో గిల్లడం సబబుకాదు. అది పాకిస్థాన్ సూపర్ లీగ్ కావొచ్చు. మరొకటి కావొచ్చు. కానీ నిబంధనలు పాటించాలి కదా.. బౌలింగ్ లో సత్తా చూపించి గెలవాలి. పరుగులను నియంత్రించాలి. అప్పుడే అతడిలో ఉన్న క్రీడా స్ఫూర్తి బయటపడుతుంది. అంతేగాని ఇలాంటి వ్యవహారాలకు పాల్పడితే పరువు పోతుందని’ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.