Babar Azam BBL15: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఎందుకంటే ఇంట్లో గెలిస్తే ఆ వ్యక్తికి బలం ఉంటుంది. ఆ తర్వాత బయట గెలిస్తే అతడి బలం మరింత పరిపూర్ణమవుతుంది. అందువల్లే ఈ నానుడిని పూర్వకాలంలో పెద్దలు వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ఈ నానుడిని మన భారత జట్టుకు సంబంధించిన క్రికెటర్లు అనేక సందర్భాలలో నిజం చేసి చూపించారు. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించి.. ఇంటర్నేషనల్ క్రికెట్లో అదరగొట్టారు. జాతీయ జట్టుకు వీడ్కోలు పలికిన తర్వాత.. వివిధ టోర్నీలలో సత్తా చూపించారు. తద్వారా విశ్వవేదిక మీద మూడు రంగుల జెండాను రేపరెపలాడించారు.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు.. పాకిస్తాన్ ప్లేయర్లు భారత ఆటగాళ్ల మాదిరిగా వ్యవహరించాలని అనుకుంటారు. కానీ ఆదిలోనే హంసపాదు లాగా వారి ఆట తీరు కొనసాగుతుంది. పైగా విదేశాలలో నిర్వహించే లీగ్ లలో పాకిస్తాన్ ప్లేయర్లకు డిమాండ్ అంతగా ఉండదు. అతి కష్టం మీద పాకిస్తాన్ ప్లేయర్లు వివిధ లీగ్ లలో అవకాశాలను సొంతం చేసుకున్నప్పటికీ.. అంతగా ఆడలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ జాబితాలో ఇప్పుడు పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ అజాం కూడా చేరాడు. అంతేకాదు, విఫల ప్రదర్శన చేసి పరువు మొత్తం పోగొట్టుకున్నాడు..
పాకిస్తాన్ దేశంలో బాబర్ అజాం ను విరాట్ కోహ్లీతో పోల్చుతుంటారు. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని.. పరుగుల వరద పారిస్తాడని అంటుంటారు. కెరియర్ మొదట్లో అతడు బాగానే ఆడేవాడు. ఆ తర్వాత సున్నాలు చుట్టడం మొదలుపెట్టాడు. దీంతో కెప్టెన్సీ కోల్పోయాడు. ఇప్పుడేమో జట్టులో స్థానాన్ని కూడా కోల్పోయాడు. మెరుపుతీగ లాగా అప్పుడప్పుడు జట్టులో స్థానం దక్కించుకుంటున్నాడు. అంతే వేగంతో స్థానాన్ని కోల్పోతున్నాడు. తాజాగా అతడు బిగ్ బాష్ లీగ్ లో ఆడుతున్నాడు. అయితే ఈ వేదిక మీద అతడు విఫల ప్రదర్శన చేస్తున్నాడు. ఏమాత్రం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేక.. సింగిల్ డిజిట్ స్కోర్ కే అవుట్ అవుతున్నాడు. బాబర్ అలా అవుట్ అవుతున్న తీరును చూస్తున్న అభిమానులు ఆవేదన చెందుతున్నారు. నెటిజన్లు మాత్రం బాబర్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇక నీ పని అయిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా బాబర్ తన ఆట తీరు మార్చుకుంటాడా? లేక ఇలానే కంటిన్యూ చేస్తాడా? ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ బౌలర్ ఇదే లీగ్ లో ఇష్టానుసారంగా బౌలింగ్ వేసి ఉద్వాసనకు గురయ్యాడు.
Babar Azam is OUT!
Here’s how Tom Curran knocked over the Pakistan international #BBL15 pic.twitter.com/leMz9bNwLV
— KFC Big Bash League (@BBL) December 26, 2025