YCP vs TDP: కుప్పంలో వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ రెడీయేనా?

YCP vs TDP: కుప్పం మున్సిపాలిటీలో ఎలాగైనా పాగా వేయాలని అధికార పార్టీ వైసీపీ, టీడీపీ సిద్ధమయ్యాయి. ఇక్కడ బాబును ఓడించి ఆయన విజయం ఇక అసాధ్యమనే వాదన తీసుకురావాలని వైసీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అక్కడ మంత్రి పెద్దిరెడ్డి సవాలుగా తీసుకుని ఎన్నికల ప్రక్రియను తనదైన శైలిలో ముందుకు నడిపిస్తున్నారు. అధికార బలంతో అణచివేత ధోరణికి కూడా పాల్పడేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా కుప్పంను వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. […]

Written By: Srinivas, Updated On : November 15, 2021 12:29 pm
Follow us on

YCP vs TDP: కుప్పం మున్సిపాలిటీలో ఎలాగైనా పాగా వేయాలని అధికార పార్టీ వైసీపీ, టీడీపీ సిద్ధమయ్యాయి. ఇక్కడ బాబును ఓడించి ఆయన విజయం ఇక అసాధ్యమనే వాదన తీసుకురావాలని వైసీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అక్కడ మంత్రి పెద్దిరెడ్డి సవాలుగా తీసుకుని ఎన్నికల ప్రక్రియను తనదైన శైలిలో ముందుకు నడిపిస్తున్నారు. అధికార బలంతో అణచివేత ధోరణికి కూడా పాల్పడేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా కుప్పంను వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఆగడాలను అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నారు. తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు పడ్డాయనే ప్రతిపక్ష పార్టీ వాదనను ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగకుండా ఉండేందుకు టీడీపీ నేతలు కూడా భారీ మొత్తంలో మోహరిస్తున్నారు.

అధికార పార్టీ ఎలాంటి అక్రమాలకు పాల్పడినా తగిన బుద్ధి చెబుతామని టీడీపీ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు సైతం కుప్పం వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు సైతం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: Retail Inflation: ధరల పెరుగుదల.. సామాన్యుడి విలవిల

దీంతో ఇక్కడ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారనుంది. వైసీపీ ఎలాంటి వక్రమార్గాల్లో వెళ్లినా నిరోధించేందుకు పలు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఎలాగైనా కుప్పంలో వైసీపీని నిలువరించాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే టీడీపీ కార్యకర్తలను అన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచనలు చేస్తున్నారు.

Also Read: Karnataka: గొర్రెకు రూ.2 లక్షల ధరనా?

Tags