Australia vs West Indies : అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్.. యువ ప్లేయర్ దెబ్బకు వెస్టిండీస్ విలవిల..

. ఇక ఆల్ రౌండర్ గా మంచి ప్రదర్శనను కనబరిచి టీమ్ విజయంలో కీలక పాత్ర వహించిన సీన్ ఎబొట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

Written By: NARESH, Updated On : February 4, 2024 10:25 pm
Follow us on

Australia vs West Indies : ఆస్ట్రేలియా వెస్టిండీస్ టీమ్ ల మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. ఇక మూడు వన్డేల్లో భాగంగా ఈ రోజు ఆడిన రెండో వన్డే లో ఆస్ట్రేలియా 83 పరుగులతో తేడాతో వెస్టిండీస్ మీద ఒక భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇంతకు ముందు ఆడిన మొదటి మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియా ఒక భారీ విక్టరీని సాధించింది. ఇక అదే ఊపు తో ఈ మ్యాచ్ లో కూడా వెస్టిండీస్ ప్లేయర్లు ను బోల్తా కొట్టి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్ నిర్ణీత 50 ఓవర్లకి 9 వికెట్లను కోల్పోయి 258 పరుగులు చేసింది. ఇక ఆస్ట్రేలియన్ టీమ్ లో ఉన్న ప్లేయర్లు ఎవరు కూడా పెద్దగా పర్ఫాం చేయనప్పటికీ ‘సీన్ ఎబోట్’ మాత్రం 69 పరుగులు చేశాడు. అందులో 4 భారీ సిక్సర్లు కూడా ఉండటం విశేషం… ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీమ్ లో భారీ స్కోరు చేసిన ప్లేయర్ గా కూడా నిలిచాడు. వాళ్ల ప్లేయర్లు అందరూ ఫెయిల్ అయినప్పటికీ ఎబోట్ మాత్రం ఎక్కడ తడబడకుండా ఒక భారీ ఇన్నింగ్స్ ఆడి టీమ్ కి గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో తన వంతు పాత్ర పోషించాడు.

అలాగే రెండు వికెట్లు తీసి బౌలింగ్ లో కూడా తన సత్తా చాటుకున్నాడు. ఇక తను ఆల్ రౌండర్ గా మంచి పర్ఫామెన్స్ ఇవ్వడంతో ఆస్ట్రేలియన్ టీం ఈ మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించింది. ఇక 3 వన్డేల్లో భాగంగా ఆస్ట్రేలియా మొదటి రెండు మ్యాచ్ లను గెలిచి ఈ సిరీస్ ని సొంతం చేసుకుంది. ఇక ఇంతకుముందు ఆడిన టెస్ట్ సిరీస్ లో రెండు జట్లు కూడా బాగా ఆడి 1-1 తో ఆ సిరీస్ ని సమం చేయగా, వన్డే సిరీస్ ని మాత్రం ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.

ఇక రెండో మ్యాచ్ లో వెస్టిండీస్ బ్యాట్స్ మెన్స్ పెద్దగా ప్రభావం చూపించలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పెవిలియన్ బాట పట్టారు. దాంతో వెస్టిండీస్ 43.3 ఓవర్లలోనే 175 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దాంతో 83 పరుగుల తేడాతో ఇండియన్ టీమ్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఆల్ రౌండర్ గా మంచి ప్రదర్శనను కనబరిచి టీమ్ విజయంలో కీలక పాత్ర వహించిన సీన్ ఎబొట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.