Australia Vs South Africa: వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా టీముల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద 134 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా ఒక భారీ విజయాన్ని సాధించింది.ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా టీమ్ నిర్ణీత 50 ఓవర్లకి 7 వికెట్లను కోల్పోయి 311 పరుగులు చేసింది.ఇక ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా టీం లో ఓపెనర్ ప్లేయర్ అయినా డికాక్ అద్భుతమైన సెంచరి చేయడంతో సౌత్ ఆఫ్రికా భారీ స్కోరు చేయగలిగింది.
ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కి దిగిన సౌత్ ఆఫ్రికా టీమ్ కి మొదట్లోనే మంచి ఆరంభం లభించింది. వికెట్ కీపర్ అయిన డికాక్ సౌత్ ఆఫ్రికా టీం కెప్టెన్ అయినా బావుమా ఇద్దరు కలిసి మొదటి వికెట్ కి 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఇక ఈ క్రమంలోనే 35 పరుగులు చేసిన బావుమా మాక్స్ వెల్ బౌలింగ్ లో అవుట్ అవ్వడం జరిగింది.
ఇక అదే విధంగా క్రీజ్ లోకి వచ్చిన మార్కరం కూడా ఆఫ్ సెంచరీ చేసి సౌత్ ఆఫ్రికా టీమ్ భారీ పరుగులు చేయడంలో తన వంతు గా తను చాలా కృషి చేశాడు.ఇక వరుసగా క్లాసెస్ , మిల్లర్, మార్కో జాన్సన్ ముగ్గురు కొంతవరకు పర్లేదు అనిపించారు. ముఖ్యంగా డికాక్ మాత్రం 106 బంతుల్లో 5 సిక్స్ లు ,8 ఫోర్లు కొట్టి 109 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ బౌలర్లను దాటి గా ఎదురుకుంటు సౌత్ ఆఫ్రికా టీం కి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేయడం లో ఆస్ట్రేలియన్ బౌలర్లు చాలా వరకు ఫెయిల్ అయ్యారు. ఇక స్టార్క్,హాజిల్ వుడ్ లాంటి పేసర్లు కూడా ఈ మ్యాచ్ లో పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయారు.
ఇక ఆస్ట్రేలియన్ బౌలర్ల లో స్టార్క్ రెండు వికెట్లు తీశాడు,అలాగే మాక్స్ వెల్ కూడారెండు వికెట్లు తీశాడు,హజిల్ వుడ్, కమిన్స్, జంపా ముగ్గురు తలో వికెట్ తీశారు.ఇక సౌత్ ఆఫ్రికా టీం ని కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా టీమ్ లోని బౌలర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. దాంతో సౌత్ ఆఫ్రికా టీం నిర్ణీత 50 ఓవర్లకి 311 పరుగులను చేసింది. ఇక 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టీం కి మొదట్లోనే భారీ దెబ్బ తగిలింది. మాక్రో జాన్సన్ వేసిన బాల్ ని సరిగ్గా ఎదుర్కోలేక మిచెల్ మార్ష్ బావూమా కి క్యాచ్ ఇచ్చే అవుట్ అయ్యాడు.ఇక వార్నర్ కూడా తొందరగానే అవుట్ అయ్యాడు. దాంతో ఆస్ట్రేలియన్ టీం పీకల్లోతు కష్టాల్లో పడింది అపుడు క్రీజ్ లోకి వచ్చిన లబుషంగే ఒక్కడు మాత్రమే 46 పరుగుల చేయగలిగాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు ఆస్ట్రేలియా మరోసారి తన ఫీలవమైన పర్ఫామెన్స్ ని చూపించింది ఇక 40.5ఓవర్లలో 177 పరుగులు చేసి అలౌట్ అయింది.
ఇక సౌత్ ఆఫ్రిక బౌలర్లలో కగిసో రబాడ మూడు వికెట్లు తీయగా,మర్కో జాన్సన్, కేశవ్ మహారాజ్ 2 వికెట్లు తీశారు, అలాగే శంశి కూడా రెండు వికెట్లు తీశాడు ఇక లుంగీ ఎంగిడి మాత్రం ఒక వికెట్ తీశాడు. ఇక దీంతో వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది..