AUS vs NZ : వరల్డ్ కప్ లో ఆడే ప్రతి మ్యాచ్ కూడా నరాలు తెగిపోయేంత ఉత్కంఠను రేకెత్తిస్తు సాగుతున్నాయి అని అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే ప్రతి మ్యాచ్ కూడా ఫైనల్ మ్యాచ్ ని తలపిస్తూ ఫైనల్ లో ఎలాగైతే సస్పెన్స్ కి గురి అవుతామో ఇప్పుడు కూడా అదే విధం గా ప్రతి మ్యాచ్ కూడా అనుక్షణం సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ వస్తుంది. ఇక దానికి ఏమాత్రం తీసుపోకుండా చూసే ప్రతి ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షిస్తూ కనురెప్ప కూడా వాల్చకుండ ఉండెంత ఉత్కంఠను క్రియేట్ చేస్తూ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇక ఈరోజు కూడా న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి బంతి వరకు కూడా ఎవరు ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తారు అనే దానిమీద ఎవ్వరికి క్లారిటీ లేదు.
ఎందుకంటే భారీ పరుగులు చేసిన ఆస్ట్రేలియా టీం కి ఏ మాత్రం తీసుపోకుండా న్యూజిలాండ్ టీమ్ చేజింగ్ లో చివరి వరకు తీసుకొచ్చి చివర్లో ఓడిపోయిన న్యూజిలాండ్ టీం కూడా ఒక వీరోచిత పోరాటం చేసిందనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం 388 పరుగుల భారీ స్కోరు చేసింది.ఇక న్యూజిలాండ్ టీమ్ 389 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఎక్కడ కూడా తడబడకుండా అద్భుతమైన పర్ఫామెన్స్ ను ఇస్తూ చాలా బాగా ఆడారు.
కాకపోతే ఆస్ట్రేలియన్ టీం పాటించిన స్ట్రాటజీని న్యూజిలాండ్ టీం పాటించలేకపోయింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ టీమ్ కి అద్భుతమైన స్కోర్ ను అందించారు. దాన్ని డిఫెన్ చేస్తూ వాళ్ల బౌలర్లు అయిన ఆడమ్ జంప మంచి స్పెల్ వేయడంతో ఈ మ్యాచ్ లో మొదటి నుంచి కూడా ఆస్ట్రేలియన్ బౌలర్లు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ ని కొంత వరకు కట్టడి చేస్తూ వచ్చారు. ఇక రచిన్ రవీంద్ర, మిచెల్ వల్లనే న్యూజిలాండ్ టీమ్ కి మ్యాచ్ మీద ఆశలు పుట్టాయి…ఇక మిగితా వారందరూ కూడా ఆస్ట్రేలియన్ బౌలర్ల ట్రాప్ లో పడ్డారు. అయిన కూడా చివరి వరకు మ్యాచ్ ని తీసుకు వచ్చారు కానీ నీషమ్ రన్ అవుట్ అవ్వడంతో న్యూజిలాండ్ ప్లేయర్లు చేతులెత్తేయాల్సి వచ్చింది. కానీ ఈ ఉత్కంఠ బరిత పోరు అనేది ఇప్పటివరకు మనం వరల్డ్ కప్ లో ఏ మ్యాచ్ లో కూడా చూదలేదు.
ఒక విధంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ అద్భుతంగా కొనసాగింది.ఇక ఎప్పటి లాగే ఆస్ట్రేలియా మరోసారి వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ మీద తన ఆధిపత్యాన్ని చూపించింది.ఇప్పటివరకు ప్రతి వరల్డ్ కప్ లో కూడా ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ ని ఓడిస్తూనే వస్తుంది.ఇక అదే ఆచారంగా ఇప్పుడు కూడా ఓడించింది.ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా టీమ్ న్యూజిలాండ్ టీం తో సమానమైన విజయాలను అందుకొని ఆస్ట్రేలియన్ టీం కూడా సెమిస్ రేస్ లో ఒక అడుగు ముందుకు దూసుకు వచ్చింది. న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా రెండు టీములు కూడా నాలుగు విజయాలను అందుకొని ఎనిమిది పాయింట్ల తో ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్ లలో కొనసాగుతున్నారు. అయితే ఆస్ట్రేలియా మొదటి రెండు మ్యాచ్ లను మినహా ఇస్తే ఇప్పుడు ఆడే ప్రతి మ్యాచ్ లో కూడా బాగా ఆడుతుంది.ముందుగా వాళ్ళు ఎవరికి భయపడడం లేదు.ఇక వాళ్ల ఓపెనర్లు వార్నర్, హెడ్ ఇద్దరు కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ని ఆడడానికి మొగ్గు చూపిస్తున్నారు.
ఇక ఎప్పుడు అయితే వాళ్లు హిట్టింగ్ కి దిగారో అప్పటినుంచి ప్రతి మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియా గెలుస్తూ వస్తుంది. మొదటి మ్యాచ్ ల్లో తడపటప్పటికీ ఆ తర్వాత నుంచి బ్యాటింగ్ ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగి ప్రతి మ్యాచ్ లో కూడా గెలుస్తున్నారు. ముఖ్యంగా వాళ్ల దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు మ్యాచ్ ని భయంతో కాకుండా ఎలాగైనా గెలవాలనే ధైర్యంతో ఆడుతున్నారు.అదే వాళ్ళను ప్రతి మ్యాచ్ లో కూడా గెలిపిస్తూ వస్తుంది. ఆస్ట్రేలియా టీం లో వార్నర్ , హెడ్ ఇద్దరు కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేసి టీం కి భారీ స్కోరు అందించారు.ఇక బౌలింగ్ లో ఆడమ్ జంపా మాత్రం తనదైన రీతిలో అద్భుతమైన స్పెల్ వేసి మరొకసారి టీం విజయంలో కీలక పాత్ర వహించాడు. ఇక దీంతో మరోసారి సెమీస్ బెర్త్ లో భారీ మార్పులు జరగబోతున్నాయి….