Homeక్రీడలుక్రికెట్‌England Vs Australia :  యాషెస్‌లో.. ఆసిస్‌ బోణీ.. తొలి వన్డేలో ఘన విజయం!

England Vs Australia :  యాషెస్‌లో.. ఆసిస్‌ బోణీ.. తొలి వన్డేలో ఘన విజయం!

England Vs Australia :  యాసెష్‌ సిరీస్‌.. ఇంగ్లండ్(England), ఆస్ట్రేలియా(Australia) మధ్య జరిగే టోరీ, బోర్డర్‌ – గవాస్కర్‌ ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌. ఈ రెండింటికి క్రికెట్‌ ప్రపంచంలో మంచి గుర్తింపు ఉటుంది. ఈ సిరీస్‌ ఒకేడాది ఒక దేశంలో మరో ఏడాది ఇంకో దేశంలో జరుగుతుంది. బోర్డర్‌–గవాస్కర్‌ మధ్య జరిగే మ్యాచ్‌ కేవలం పురుష జట్ల మధ్యనే జరుగుతుంది. కానీ యాషెస్‌ సిరీస్‌ ఆస్ట్రేలియా–ఇంగ్లండ్‌ పురుష జట్లతోపాటు మహిళా జట్ల మధ్య కూడా జరుగుతుంది. మహిళా యాషెస్‌ సిరీస్‌–2025 తాజాగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌ జనవరి 12న జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆష్లే ఆర్డ్నార్‌ ఆల్‌రౌండ్‌షోతో(3/19, 42 నాటౌట్‌)తో అదరగొట్టి ఆసిస్‌ను గెలిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లడ్‌ జట్టు 43.1 ఓవర్లలో కేవలం 204 పరుగులు మాత్రమే చేసింది. ఆసిస్‌ బౌలర్లకు ఇంగ్లండ్‌ జట్టు 43.1 ఓవర్లకే కుప్పకూలింది.

రాణించిన ఆసిఫ్‌ బౌలర్లు..
ఈ మ్యాచ్‌లో ఆసిస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌చేశారు. ఆష్లే గార్డ్నర్‌ మూడు, కిమ్‌ గార్త్, అన్నా బెల్‌ సదర్లా్యండ్, అలానా కింగ్‌ తలో రెండు వికెట్లో పడగొట్టారు. డార్ఫీ బ్రౌన్‌ ఒక వికెట్‌ తీసింది. ఇక ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ హీథర్‌ నైట్‌(39), వ్యాట్‌ హాడ్జ్‌(38), అమీ జోన్స్‌(31) మాత్రమే రాణించారు. టామీ బేమౌంట్‌(13), నాట్‌ సీవర్‌బ్రంట్‌(19), సోఫీ ఎక్లెస్టోన్‌(16) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. మయా బౌచియర్‌ 9, అలైస్‌ క్యాప్సీ4, చార్లీడీన్‌ 1, లారెన్‌ బెల్‌ 1, లారెన్‌ ఫైలర్‌ 8(నాటౌట్‌) పరుగులు చేశారు.

38 ఓవర్లలోనే గెలుపు..
205 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 38. ఓవర్లలో ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యం ఛేదించింది. ఓపెననర్‌ అలైసా హీలీ(70) ఆసీస్‌ గెలుపునకు పునాది వేసింది. ఆషస్త్ల్ర గార్డ్నర్‌(44 బంతుల్లో 42 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్స్‌) తన జట్టును విజయ తీరానికి చేర్చారు. ఆసిస్‌ ఇన్నింగ్స్‌లో ఫోట్‌ లిచ్ఫీల్డ్‌ 4, ఎల్లిస్‌ పెర్రీ 14, బెత్‌ మూనీ 28, అన్నాబెల్‌ సదర్లా్యండ్‌ 10, తహిళ మెక్‌గ్రాత్‌ 2, అలానా కింగ్‌ 11(నాటౌట్‌) పరుగులు చేశారు.

ఇంగ్లండ్‌ బౌలర్లు ఇలా..
ఇక ఇంగ్లండ్‌ మహిళా జట్టు బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్, లారెన్‌ ఫైలర్‌ తలో రెండు వికెట్లు, లారెన్‌ బెల్, చార్లెట్‌ డీన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో ఆసిస్‌ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1–0 ఆధిక్యంలోకి వెల్లింది. జట్ల మధ్య రెండో వన్డే మెల్‌బోర్న్‌లో జనవరి 14న జరుగుతుంది. మూడు వన్డేలు, మూడు టీ20లు, ఒక టెస్ట్‌ మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version