Homeక్రీడలుIndia- Pakistan Match: ఆసియా కప్ షెడ్యూల్: ఇండియా-పాకిస్తాన్ హైఓల్టేజ్ మ్యాచ్ ఎప్పుడంటే?

India- Pakistan Match: ఆసియా కప్ షెడ్యూల్: ఇండియా-పాకిస్తాన్ హైఓల్టేజ్ మ్యాచ్ ఎప్పుడంటే?

India- Pakistan Match: ఇండియా, పాకిస్తాన్ దాయాది దేశాలు. అవి ఎక్కడ ఎదురుపడినా యుద్ధ వాతావరణమే. క్రికెట్లో అయితే అభిమానులకు పండుగే. ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా వాటిని వదులుకుని ఇంట్లో టీవీలకు అతుక్కుపోవాల్సిందే.ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంతటి ఉత్కంఠ ఉండటం సహజమే. ప్రస్తుతం ఆ అవకాశం మళ్లీ వస్తోంది. ఆసియా కప్ రూపంలో మన కోరిక తీరబోతోంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ టోర్నమెంట్ జరగనుంది. ఇందులో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ ఇప్పటికే అర్హత సాధించగా ఒక టీం కోసం నాలుగు జట్లు హాంకాంగ్, కువైట్, యూఏఈ, సింగపూర్ జట్లు క్వాలిఫయర్ కోసం పోటీ పడుతున్నాయి.

India- Pakistan Match
India- Pakistan Match

ఈనెల 27న శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్ తో టోర్నీ ప్రారంభం అవుతుంది. 28న పాకిస్తాన్ తో ఇండియా తలపడనుంది. దీంతో ప్రేక్షకులకు పండుగ వాతావరణం కలగనుంది. ఈ మేరకు ఇప్పటి నుంచే అభిమానులు తహతహలాడుతున్నారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే వచ్చే మజా వేరని పలువురు పేర్కొంటున్నారు. క్రికెట్ ఆడితే పాకిస్తాన్ తో ఆడితేనే అందులో మజా అందరికి తెలుస్తుంది. దీంతో రెండు దేశాల అభిమానులు మ్యాచ్ కోసం తహతహలాడుతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

వాస్తవానికి కరోనా సమయంలో 2020లోనే ఈ టోర్నీ జరగాల్సి ఉన్నా వాయిదా పడింది. శ్రీలంక ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో తాము టోర్నీ నిర్వహించలేమని చెప్పడంతో వేదిక యూఏఈకి బదిలీ అయింది. దీంతో టీ20 ఫార్మాట్ లో టోర్నీ జరగనుంది. దీనికి గాను ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ ఆధారంగా వారిని తీసుకోవాలని భావిస్తోంది. మెరుగ్గా రాణించే వారికే అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఈ మేరకు తుది జట్టు ఎంపిక కోసం కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

ఆసియా కప్ రికార్డులు భారత్ కు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటివరకు 14 సార్లు టోర్నీలు జరగ్గా భారత్ ఏడు సార్లు చాంపియన్ గా నిలవడం గమనార్హం. తరువాత స్థానంలో శ్రీలంక ఐదుసార్లు విజేతగా నిలిచింది. పాకిస్తాన్ మాత్రం రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. దీంతో ఈ సారి కూడా ఫేవరేట్ గా భారత్ నిలవనుందని తెలుస్తోంది. ఆటగాళ్ల సమష్టి రాణింపు జట్టు విజయాల్లో కీలకం కానుంది. అందుకే ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటనలో విజయాల బాటలో నడుస్తోంది. ఇక్కడ కూడా రోహిత్ సేన ఇదే పంథా కొనసాగించి కప్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version