India vs Pakistan Asia Cup: ఆసియా కప్ లో పాకిస్థాన్ ప్రస్థానం అంత గొప్పగా లేదు. వాస్తవానికి ఆ జట్టు మీద ఎవరికి పెద్దగా అంచనాలు లేవు కాబట్టి దానిని లెక్కలోకి తీసుకోవడం లేదు. బౌలింగ్ అద్వానంగా ఉంది. బ్యాటింగ్ దారుణంగా ఉంది. ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక ఫీల్డింగ్ అయితే అత్యంత నాసిరకం. ఇప్పటివరకు లీగ్ దశలో మూడు మ్యాచ్ లు ఆడింది పాకిస్తాన్. ఇందులో భారత జట్టు చేతిలో ఓటమిపాలైంది. మిగతా రెండు చిన్న జట్ల మీద చచ్చి చెడి గెలిచింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు సూపర్ 4 విభాగంలో భారత జట్టుతో ఆదివారం తలపడాల్సి ఉంటుంది.
ఇప్పటికే భారత్ లీగ్ దశలో పాకిస్తాన్ జట్టును ఓడించింది. అది కూడా ఏడ వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. చివరికి గెలిచిన తర్వాత కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి టీమిండియా కెప్టెన్ ఆసక్తి చూపలేదు. దీంతో పాకిస్తాన్ పరువు సింధు నదిలో కలిసింది. ఏం చేయాలో తెలియక icc మీద చిందులు తొక్కింది. ఐసీసీ కన్నెర్ర చేయడంతో పాకిస్తాన్ జట్టుకు ఏం చేయాలో అర్థం కాక అన్ని మూసుకుంది. చివరికి ఇటీవల చివరి దశ లీగ్ మ్యాచ్ ఆడే క్రమంలో డ్రెస్సింగ్ రూమ్ కు పరిమితమైంది. బయటికి రావడానికి ఆసక్తిని చూపించకపోవడంతో ఐసీసీ హెచ్చరించింది. దీంతో అన్ని మూసుకొని పాకిస్తాన్ మైదానంలోకి వచ్చింది.
Also Read: మతిమరుపులో రోహిత్ ను దించేసిన సూర్య.. ప్లేయింగ్ 11 ను మరిచిపోయాడు.. వైరల్ వీడియో
భారత జట్టుతో ఎదురైన పరాభవాన్ని.. పరువు భంగాన్ని పాకిస్తాన్ ఇప్పటికీ మర్చిపోలేకపోతోంది. చివరికి ఆ జట్టు మాజీ ఆటగాళ్లు భారత్ మీద తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు చెత్త వ్యాఖ్యలు చేశాడు. దీనిపై యావత్ క్రికెట్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ మాజీ ఆటగాడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఇంత జరిగినప్పటికీ పాకిస్తాన్ ఆటగాళ్లు మారలేదు. మారాలని ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇప్పటికే గోటి చుట్టు రోకటి పోటు లాగా పాకిస్తాన్ పరిస్థితి మారిపోయింది. దానికి కొనసాగింపుగా మరో ఉపద్రవం ఆ జట్టుకు వచ్చింది. ఎందుకంటే భారత జట్టుతో తలపడే మ్యాచ్ కు రిఫరీగా అండి పై క్రాఫ్ట్ ను ఐసీసీ నియమించింది. ఇటీవల పాకిస్తాన్ చేసిన ఆరోపణలు మొత్తాన్ని బుట్ట దాఖలు చేసింది. అన్నింటికీ మించి రిఫరీ విషయంలో అడ్డగోలు ఆరోపణలు చేస్తే మర్యాద దక్కదని వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ పరువు మరోసారి సింధూ నదిలో కలిసిపోయింది.