Suryakumar Yadav: “టాస్ వేస్తున్నప్పుడు కాయిన్ గమనాన్ని అంచనా వేయలేడు. అప్పుడప్పుడు జట్టులో ఉన్న 11 మంది ఆటగాళ్ల పేర్లను మర్చిపోతుంటాడు. అప్పటికప్పుడు గుర్తు తెచ్చుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. ఇది ఒకటి కాదు, రెండు కాదు.. అనేక సందర్భాలలో జరిగింది. అయినప్పటికీ అతడు తీరులో మార్పు లేదు. మార్పు రాలేదు. ఇకపై మార్పు వచ్చే అవకాశం కూడా లేదు.. ఇలా ఎందుకు జరుగుతుందో అతనికే తెలియదు.. పాపం టీమ్ ఇండియాలో గజిని అయిపోయాడు..” రోహిత్ గురించి అప్పట్లో ఓ ఫేమస్ ఇంగ్లీష్ మ్యాగ్జిన్ లో వచ్చిన వార్త కథనం ఇది. వాస్తవానికి ఇది నొప్పించే కథనం కాదు. సెటైరికల్ గా రాశారు. ఈ విషయాన్ని రోహిత్ శర్మ ఓ సందర్భంలో చెప్పుకుంటూ నవ్వుకున్నాడు కూడా.
రోహిత్ మాదిరిగా ఎవరుంటారు.. అంత పరధ్యానంలో ఉండే ఆటగాడు ఎవరు.. అనే ప్రశ్నలు తరచూ వినిపించేవి. వాస్తవానికి టీం ఇండియాలో ఇప్పుడు మూడు ఫార్మాట్లకు ముగ్గురు సారధులు ఉన్నారు. టెస్ట్ ఫార్మాట్ లో గిల్, టి20 ఫార్మాట్ లో సూర్య కుమార్ యాదవ్, వన్డే ఫార్మాట్ లో రోహిత్ కొనసాగుతున్నారు. గిల్ టెస్ట్ సారధిగా తను ఏమిటో ఇంగ్లాండ్ సిరీస్ లో నిరూపించుకున్నాడు. పైగా జట్టు విషయాల గురించి మాట్లాడుతుంటే ఎటువంటి తడబాటు లేకుండా అతడు సమాధానం చెబుతుంటాడు. జట్టు ఆటగాళ్ల విషయాలు.. ఆటగాళ్ల పేర్లు.. ఆడే విధానం.. ఇలా ప్రతి విషయం గురించి గుక్క తిప్పుకోకుండా సమాధానం చెబుతుంటాడు గిల్. సూర్య కుమార్ మాత్రం ఇందుకు భిన్నం. ఎందుకంటే అతడు మతిమరుపులో రోహిత్ శర్మను మించిపోతున్నాడు. నయా గజినీగా రూపాంతరం చెందుతున్నాడు. ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చే సంఘటన శుక్రవారం జరిగింది. దీంతో మైదానంలో నవ్వులు విరిసాయి.
ఆసియా కప్ లో భాగంగా భారత జట్టు శుక్రవారం ఒమన్ తో పోటీ పడింది. ఈ మ్యాచ్లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా లీగ్ దశను అత్యంత విజయవంతంగా ముగించింది. అంతేకాదు ఆదివారం నాటి సూపర్ 4 పోరుకు సిద్ధమైంది. పాకిస్తాన్ జట్టుతో మరోసారి భారత్ తలపడబోతోంది. ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా సారధి తడబడ్డాడు. టాస్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. వ్యాఖ్యాత కొన్ని ప్రశ్నలు అడిగితే సూర్యకుమార్ యాదవ్ తడబడ్డాడు. ముఖ్యంగా జట్టు ఆటగాళ్ల పేర్లను వెల్లడించడంలో అతడు మతిమరుపునకు గురయ్యాడు. అనేక సందర్భాల్లో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతడికి ఆటగాళ్ల పేర్లు జ్ఞప్తికి రాలేదు. దీంతో ఆ సన్నివేశాన్ని చూస్తున్న ప్రేక్షకులు నవ్వుకున్నారు. చివరికి వ్యాఖ్యాత కూడా ఇదేంటి ఇలా అయిపోయావు అన్నట్టుగా ముఖం పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది.
Looks like Rohit Sharma finally found a partner in crime Surya joins the ‘forgetting names at toss’ club while announcing changes
Surya Kumar Yadav : I Have become like Rohit Sharma (Laughs) pic.twitter.com/o2Y9ANQlh3
— (@TheRealPKFan) September 19, 2025