Asia Cup 2025 Pakistan Vs Bangladesh: ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ సూపర్ ఫోర్ విభాగంలో గురువారం కీలకమైన మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు భారత జట్టుతో ఫైనల్ లో తలపడుతుంది. సూపర్ 4 లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ చెరొక విజయం సాధించాయి.. ఇదే సమయంలో చెరో ఓటమి కూడా నమోదు చేశాయి. ఫైనల్ వెళ్లాలంటే ఈ రెండు జట్లు కచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకోవాలి. దీంతో గురువారం నాటి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. పాకిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఫర్హాన్ 4, ఫకర్ జమాన్ 13, సల్మాన్ ఆయూబ్ 0, సల్మాన్ ఆఘా 19, హుస్సేన్ తలాత్ 3 దారుణంగా విఫలమయ్యారు. షాహిన్ ఆఫ్రిది 19 .. నవాజ్ 25.. హారిస్ 31 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. వీరు ముగ్గురు గనుక నిలబడకపోయి ఉంటే పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
పిచ్ నుంచి లభించిన సహకారాన్ని బంగ్లాదేశ్ బౌలర్లు సంపూర్ణంగా వినియోగించుకున్నారు. ముఖ్యంగా లైన్ అండ్ లెంత్ లో బంతులు వేస్తూ పాకిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. కీలక దశలో వికెట్లు తీస్తూ దుమ్మురేపారు. వాస్తవానికి బంగ్లాదేశ్ ఫీల్డింగ్ వైఫల్యాలు పాకిస్తాన్ జట్టుకు కలిసి వచ్చాయి. ఏకంగా మూడు క్యాచ్ లను బంగ్లా ఫీల్డర్లు నేలపాలు చేశారు. తద్వారా పాకిస్తాన్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. లేకపోతే పరిస్థితి మరింత అద్వానంగా ఉండేది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి పాకిస్తాన్ 135 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 3, హసన్ 2, హోసైన్ 2 వికెట్లు సొంతం చేసుకున్నారు. వాస్తవానికి బంగ్లాదేశ్ మీద పాకిస్తాన్ భారీ స్కోరు చేస్తుందని అందరూ ఊహించారు. కానీ బంగ్లా బౌలర్లు ఆశ్చర్యకరంగా బౌలింగ్ చేయడం.. ఊహించని విధంగా బంతులు వేయడంతో పాకిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు కనిపించాయి. భారీ స్కోర్ కాదు కదా.. కనీసం క్రీజులో ఉంటే చాలు అనుకునే పరిస్థితులు దాపరించాయి. అందువల్లే పాకిస్తాన్ బ్యాటర్లు నిదానంగా ఆడాల్సి వచ్చింది. వాస్తవానికి ముగ్గురు బ్యాటర్లు గనుక నిలబడకపోయి ఉంటే పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. కుప్పకూలి పోయే దశలో నిలబెట్టిన ఘనత మాత్రం ఆ ముగ్గురికే దక్కుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు భారత జట్టుతో ఫైనల్ మ్యాచ్లో తలపడుతుంది.. బంగ్లాదేశ్ మ్యాచ్లో గెలవాలంటే 136 పరుగులు చేయాలి. ఇది ఏమంత గొప్ప లక్ష్యం కాకపోయినప్పటికీ.. బంగ్లాదేశ్ జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే పాకిస్తాన్ బౌలర్లు ఎప్పుడు ఎలా బౌలింగ్ చేస్తారో ఎవరికీ తెలియదు.
Pakistanis were comparing Saim Ayub and Abhishek Sharma before the start of Asia Cup 2025.
Result: Four DUCKS for Saim Ayub in the tournament
But Pakistanis will still not learn…their illness can’t be cured #PAKvsBAN
— Madhav Sharma (@HashTagCricket) September 25, 2025