Asia Cup prize money 2025: ఆసియా కప్ అంచనాలకు తగ్గట్టుగా సాగక పోతున్నప్పటికీ.. ఇప్పటికే సగం టోర్నీ దాదాపుగా పూర్తయింది.. కొన్ని మ్యాచ్లు పూర్తవుతాయి సూపర్ 4 దశలోకి ఎంట్రీ ఇవ్వనుంది. మిగతా జట్లు బలంగా లేకపోవడం.. భారత్ సూపర్ పవర్ లాగా కనిపిస్తోంది. టైటిల్ విన్నర్ ఎలాగూ భారత జట్టే కాబట్టి.. సంచలనాలు జరుగుతాయని ఎవరూ ఊహించడం లేదు. పాకిస్తాన్, శ్రీలంక నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని అనుకుంటున్నప్పటికీ.. ఇప్పటికే పాకిస్తాన్ భారత జట్టు చేతిలో ఓడిపోయింది. శ్రీలంక కూడా పాకిస్తాన్ మాదిరిగానే ఆడుతోంది కాబట్టి.. దాని నుంచి కూడా భారత జట్టుకు పెద్దగా ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం లేదు.
ఆసియా లో క్రికెట్ ఆడే దేశాలు చాలానే ఉన్నప్పటికీ.. ప్రస్తుత టోర్నీలో మాత్రం 8 జట్లు ఆడుతున్నాయి. ఐసీసీలో పూర్తిస్థాయిలో ఐదు సభ్య దేశాలు ఉన్నాయి. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలకు టోర్నీ ఆదాయంలో దాదాపు 15 శాతం వరకు దక్కుతుంది. యూఏఈ, ఓమన్, హాంకాంగ్ దేశాలకు మిగిలిన 25% దక్కుతుంది. సభ్య దేశాలకు 15% వాటా ప్రకారం చూసుకుంటే 105 నుంచి 140 కోట్ల వరకు ఒక్కొక్క జట్టుకు దక్కే అవకాశం ఉంది. ఆసియాలో క్రికెట్ బలోపేతానికి ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఐసీసీ నిర్వహించే టోర్నీల ప్రైజ్ మనీ భారీగానే పెంచుతోంది. పురుషులతో సమానంగా మహిళల క్రికెట్ కు ఆదరణ దక్కేలా చేస్తోంది. త్వరలో మన దేశం వేదికగా జరిగే మహిళల వరల్డ్ కప్ కోసం ప్రైజ్ మనీ కూడా భారీగానే పెంచింది. పురుషుల జట్టుతో సమానంగా ప్రైజ్ మనీ కేటాయించింది.
ఇక ప్రస్తుత ఆసియా కప్ లో విజేత జట్టుకు రెండు కోట్ల వరకు ప్రైజ్ మనీ లభిస్తుంది. అయితే ఇతర మార్గాల ద్వారానే ఆయా జట్లకు అధికంగా ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా ప్రసార హక్కులు, టికెట్ల విక్రయాలు, ఇతర మార్గాల ద్వారా ఐసీసీకి ఈ టోర్నీ ద్వారా భారీగానే ఆదాయం వస్తోంది. అయితే వచ్చిన ఆదాయంలో ఐసీసీ ఆసియా క్రికెట్ కౌన్సిల్లో పూర్తిస్థాయి సభ్య దేశాలకు ఒక విధంగా.. మిగతా దేశాలకు మరొక విధంగా నజరానా అందిస్తోంది. వీటి ద్వారా స్టేడియాల ఆధునీకరణ.. వసతుల కల్పన.. ఆటగాళ్లకు సౌకర్యాలు వంటివి ఏర్పాటు చేయాలని ఆయా మేనేజ్మెంట్లను ఐసీసీ కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆసియా కప్ సాధించిన జట్టుకు అదనంగా ప్రయోజనాలు లభిస్తాయి. ఆ జట్టు విలువ అమాంతం పెరుగుతుంది. స్పాన్సర్ చేయడానికి చాలా వరకు కంపెనీలు ముందుకు వస్తుంటాయి. బ్రాండ్ విలువ ఆధారంగా మిగతా ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అందువల్లే ఆసియా కప్ సాధించడానికి అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. ఇక గత ఆసియా కప్ లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.