Ashwin IPL Retirement: కంగారు జట్టుతో బి జి టి సిరీస్ సాగుతున్నప్పుడు టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు టీమిండియా ఏస్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. దాన్ని మర్చిపోకముందే ఐపీఎల్ నుంచి కూడా తాను తప్పుకుంటున్నట్టు రవిచంద్రన్ అశ్విన్ ప్రకటించడం గమనార్హం. చెన్నై జట్టు తరఫున ఆడుతున్న అతడు రిటైర్మెంట్ ప్రకటించడం ఒకరకంగా క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.. రవిచంద్రన్ అశ్విన్ ఉన్నట్టుండి ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అనే చర్చ సర్వత్రా వినిపిస్తుండగా టెలిగ్రాఫ్ స్పోర్ట్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.
Also Read: MyHome రామేశ్వర్ రావు… పెద్ద గేమ్ ప్లాన్ !
సుదీర్ఘ ఫార్మాట్లో రవిచంద్రన్ అశ్విన్ 537 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనత అందుకున్న ఏడవ బౌలర్ గా అతడు నిలిచాడు.. కొంతకాలంగా సరైన లయతో బౌలింగ్ వేయలేకపోతున్న ఈ చెన్నై ఆటగాడు సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది సాగిన ఐపీఎల్ లో చెన్నై జట్టు తరుపున ఆడి.. ఇప్పుడు ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం ఇంగ్లాండ్లో జరిగే “ది హండ్రెడ్” టోర్నీలో అతడు ఆడ బోతున్నాడు. ఈ లీగ్ లో ఆడుతున్న తొలి భారతీయ పురుష క్రికెటర్ గా ఈ తమిళ ఆటగాడు చరిత్ర సృష్టించాడు.. మన దేశ క్రికెట్ నిబంధనల ప్రకారం భారత క్రికెట్ నియంత్రణ మండలి తో అన్ని సంబంధాలు పెంచుకున్న తర్వాతే విదేశీ క్రికెట్ లీగ్ లలో ఆడేందుకు అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని బుధవారం సోషల్ మీడియాలో చేసిన ప్రకటన ద్వారా అశ్విన్ వెల్లడించాడు..” ప్రత్యేకమైన రోజు ఇది. ఒక ప్రత్యేకమైన ప్రారంభం. ప్రతి ముగింపు కొత్త ప్రారంభానికి నాంది పలుకుతుంది. ఐపీఎల్ లో ఒక క్రికెటర్ గా నా సమయం ఈరోజుతో ముగిసింది. కానీ వివిధ లీగ్ ల చుట్టూ సరికొత్త అవకాశాలను అన్వేషిస్తున్న నా సమయం ఈరోజుతో మొదలవుతుంది. అనేక సంవత్సరాలుగా అన్ని అద్భుతమైన జ్ఞాపకాలు, సంబంధాలను అందించిన ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని” అశ్విన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు..
స్వేచ్ఛగా ఆడొచ్చు
భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి కాంట్రాక్టు పొందిన ఆటగాడు కాకపోవడంతో అశ్విన్ ఇకపై ది హండ్రెడ్ టోర్నీలో పాల్గొనడంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం లేదు.. మనదేశంలో ఉన్న నిబంధనల ప్రకారం పురుష క్రికెటర్లు అన్ని స్థాయిలలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తో సంబంధాలను తెంచుకుంటే తప్ప విదేశీ క్రికెట్ లీగ్లలో ఆడే అవకాశం లేదు.. మహిళా క్రికెటర్లకు అలాంటి సమస్య లేదు. ది హండ్రెడ్ టోర్నీలో అనేకమంది ఉమెన్ క్రికెటర్లు ఆడారు.. వచ్చే ఏడాది ది హండ్రెడ్ టోర్నీలో కొత్త ఆటగాళ్లు అందుబాటులోకి వస్తారు. వేలం కూడా జరుగుతుంది. పైగా అశ్విన్ పేరుపొందిన ఆటగాడు కావడంతో ఆయనకు విపరీతమైన డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఇందులో ఉన్న 8 జట్లలో నాలుగు ఐపిఎల్ యాజమాన్య సమూహాలతో సమాధానాలు కలిగి ఉన్నాయి. దీనివల్ల అశ్విన్ వేలంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది.