IND vs BAN : మూడు వన్డేల సీరిస్ 2_1 తేడాతో గెలుచుకున్న బంగ్లాదేశ్… టెస్ట్ సిరీస్ విషయానికి వచ్చేవరకు తడబడుతోంది. ఇవాళ మొదటి ఇన్నింగ్స్ లో 133 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అద్భుతం జరిగితే తప్ప బంగ్లాదేశ్ ఓటమి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.
టెయిలెండర్లు విజృంభించారు
ఓవర్ నైట్ స్కోర్ 278 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 404 పరుగులు చేసింది. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్, కులదీప్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ బంగ్లాదేశ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. వీరి ధాటికి భారత్ 404 పరుగులు చేసింది..ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరు కూడా తొమ్మిదో వికెట్ త్వరగా పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ దశలో రవిచంద్రన్ హాఫ్ సెంచరీ సాధించాడు.. అయ్యర్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. వీరిద్దరిని విడదీసేందుకు బంగ్లా బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది..
ఆదిలోనే దెబ్బ కొట్టారు
భారత్ మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ బ్యాటింగ్ ప్రారంభించింది. పరుగులేమీ ప్రారంభించకుండానే తొలి వికెట్ కోల్పోయింది. ఐదు పరుగులకు రెండో వికెట్, 39 పరుగులకు మూడో వికెట్, 56 పరుగులకు నాలుగో వికెట్..ఇలా 133 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. వెలుతురు సక్రమంగా ఉంటే ఆ రెండు వికెట్లు కూడా నేల కూలేవి. వాస్తవానికి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ లో ఏ ఒక్కరు కూడా గట్టిగా నిలబడలేకపోయారు. రహీం చేసిన 28 పరుగులే ఆ జట్టులో టాప్ స్కోర్ అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బౌలర్లు తడాఖా చూపారు
భారత బౌలర్లు బంగ్లాదేశ్ కు తమ బౌలింగ్ రుచి చూపించారు. ముఖ్యంగా కులదీప్ యాదవ్ బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. 10 ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అలాగే హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తొమ్మిది ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.. ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.. మూడో రోజు బంగ్లాదేశ్ ను త్వరగా ఆల్ అవుట్ చేసి… బ్యాటింగ్ కు ఆహ్వానించాలని భారత జట్టు యోచిస్తోంది.. ఇప్పటికే రెండు వందల పరుగుల పైచిలుకు ఆధిక్యంతో భారత్ కొనసాగుతోంది. అద్భుతం జరిగితే తప్ప బంగ్లాదేశ్ ఓటమి నుంచి తప్పించుకునే అవకాశం లేదు.
https://www.youtube.com/watch?v=KQJSkhMoats&t=12s
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ashwin and kuldeep steps up india tour of bangladesh 1st test
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com