Arshdeep Singh : టీమిండియాలో యువ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న అర్ష్ దీప్ సింగ్ సంచలన ప్రదర్శనలతో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. టి20 ఫార్మాట్లో తిరుగులేని బౌలర్ గా అతడు కొనసాగుతున్నాడు. టీమిండియా సాధిస్తున్న వరుస విజయాలలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. స్వదేశం, విదేశం అని తేడా లేకుండా వికెట్ల మీద వికెట్లు తీస్తూ ఔరా అనిపిస్తున్నాడు. అయితే అటువంటి అర్ష్ దీప్ సింగ్ ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఆ జట్టులో కీలక బౌలర్ గా అతడు కొనసాగుతున్నాడు. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. నిన్నటిదాకా పక్కింటి అబ్బాయి లాగా.. అమాయకుడి లాగా కనిపించిన అర్ష్ దీప్ సింగ్ .. ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు. పైగా అతడికి సంబంధించిన ప్రైవేట్ వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో మీడియాలో, సోషల్ మీడియాలో అతడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.. ఇంతకీ ఏం జరిగిందంటే..
భారత జట్టు చెందిన పేస్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ ఒక అమ్మాయి తో ఇన్ స్టా గ్రామ్ లో చాట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అయితే ఆ యువతి ఆ చాట్ ను బహిర్గతం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఎటువంటి అసభ్యకరమైన సందేశాలు లేవు.. మీరు ఏం చేస్తున్నారు.. ఇల్లు ఎక్కడ.. వంటి ప్రశ్నలను అర్ష్ దీప్ సింగ్ అడిగాడు. వారికి ఆమె సమాధానం ఇచ్చింది. అయితే ఆమెతో అతడికి గతంలో పరిచయం లేదని తెలుస్తోంది.. ఆమె సోషల్ మీడియాలో రీల్స్ విపరీతంగా చేస్తుంది. పైగా ఆమెను చాలామంది అనుసరిస్తున్నారు. చూడ్డానికి హీరోయిన్ మెటీరియల్ లాగా ఉంది.. అందువల్లే ఆమె చేసిన రీల్ కు అర్ష్ దీప్ సింగ్ రిప్లై ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆమెతో సంభాషణ కూడా జరిపినట్టు.. బయటికి విడుదలైన వీడియో ద్వారా తెలుస్తోంది.
Also Read : అమ్మాయితో అర్ష్దీప్ సింగ్ ప్రైవేట్ చాట్ లీక్
అర్ష్ దీప్ సింగ్ ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడని.. అందువల్లే వెంటనే రెస్పాండ్ అయ్యాడని.. ఆమెకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ” అర్ష్ దీప్ సింగ్ ఇన్ని రోజులపాటు సింగిల్ అనే అనుకున్నాం. ఇకపై ఆ మాటకు ఆస్కారం లేదు. ఎందుకంటే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అతడు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. అందువల్లే నేరుగా అతడే ఆమె రీల్స్ చూసి ఆనంద పరవశుడయ్యాడు. అందువల్లే నేరుగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ముందుగా ఇలాంటి సందేశాలు పంపిస్తారు. ఆ తర్వాత అసలు మ్యాటర్ చెబుతారు.. ఇంకా అనంతరం ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాలా” అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అర్ష్ దీప్ సింగ్ తో సాగించిన ప్రైవేటు వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో…ఆ యువత గురించి సోషల్ మీడియాలో చాలామంది వెతకడం మొదలుపెట్టారు. ఆమె గురించి శోధించడం ప్రారంభించారు. ఇంకా కొందరైతే ఒక అడుగు ముందుకేసి వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని చర్చ కూడా మొదలుపెట్టారు. ఇక సోషల్ మీడియాలో అయితే ప్రచారం ఒక రేంజ్ లో ఉంది. దీనిపై అర్ష్ దీప్ సింగ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.