Homeక్రీడలుLionel Messi: అర్జెంటీనా "మెస్సి" మై రైజింగ్ ఆట.. ఇంగ్లాండ్ కు దెబ్బ పడింది అక్కడే..

Lionel Messi: అర్జెంటీనా “మెస్సి” మై రైజింగ్ ఆట.. ఇంగ్లాండ్ కు దెబ్బ పడింది అక్కడే..

Lionel Messi: ఇది మామూలు ఉత్కంఠ కాదు. మామూలు తెగింపు కాదు. అర్జెంటీనా ఇవి రెండు చేసింది. చేసి చూపించి.. తన సత్తా ఏమిటో చాటింది. ఫలితంగా ఇంగ్లాండ్ గుండె పగిలింది. ఫిఫా వరల్డ్ కప్ సెమి ఫైనల్లో ఊహించని అద్భుతం చోటు చేసుకుంది. 24 సంవత్సరాలుగా ఇంగ్లాండ్ మీద తమకు ఉన్న రికార్డును అర్జెంటీనా మరింత పరిణామం చేసుకుంది.

స్టేడియంలో మెస్సి మెస్సి అంటూ అభిమానుల కేరింతలు ఆకాశాన్ని తాకాయి. తరలివచ్చిన వేలాది అభిమానుల అంచనాలను నిజం చేస్తూ మెస్సి అదరగొట్టాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన యుద్ధంలో వీరుడిగా నిలిచాడు. ఇంగ్లాండ్ జట్టు కు గర్వభంగం కలిగిస్తూ ఓటమిని పరిచయం చేశాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో చివరికి మెస్సి సూపర్ హీరోగా నిలిచాడు. ఇంగ్లాండ్ జట్టుకు కన్నీరు మిగిలించాడు.

ఈ మ్యాచ్ ఒకరకంగా మెస్సీ కి యుద్ధంలాంటిది. ఈ చివరి యుద్ధంలో గెలిచి మెస్సీ సత్తా చూపించాడు. సొంత దేశంలో గెలిచి హీరోగా నిలబడ్డాడు. తన జాతికి మొత్తం గర్వాన్ని కలిగించాడు. ఆపత్కాలంలో చివరి 90 నిమిషాలు తాను ఏమిటో నిరూపించుకున్నాడు. సరిగ్గా 1986 లో మారడోనా నెలకొల్పిన అద్భుతాన్ని పునర్ ఆవిష్కరించాడు మెస్సీ. అర్జెంటీనా చివరి రెండు గోల్స్ సాధించడం లో మెస్సీ పాత్ర అద్భుతం. ఒక దశలో ఇంగ్లాండ్ అనేక రకాల ప్రయత్నాలు చేసింది. ప్రత్యర్థి గోల్ పోస్ట్ మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ మెస్సీ అడ్డుకున్నాడు. అడ్డు గోడ లాగా నిలబడ్డాడు.

మెస్సి ఇప్పటికే తన అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక రకంగా ఇది అతనిkin చివరి ఫుట్బాల్ వరల్డ్ కప్ టోర్నీ. అయితే అతడి జోరు చూస్తుంటే అర్జెంటీ నా జట్టుకు ట్రోఫీ అందించేదాకా విశ్రాంతి తీసుకునే విధంగా కనిపించడం లేదు. ఇంగ్లాండ్ జట్టు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ.. ఆ జట్టు మానసిక స్థైర్యం మీద మెస్సి దెబ్బ కొట్టాడు. వీరోచితమైన ఆట తీరు ప్రదర్శించి.. జాతి హీరోగా నిలబడ్డాడు..

ఇప్పటిదాకా అర్జెంటీనా ఈ టోర్నీలో టాప్ 18 ర్యాంకులు ఉన్న జట్లతో ఢీకొనకుండానే సెమీస్ దాకా వచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ రిఫరీలు కూడా అర్జెంటీనా జట్టుకు అనుకూలంగా ఉన్నారని విమర్శలు వినిపించాయి. ఈ దశలో అత్యంత బలమైన ఇంగ్లాండ్ జట్టు మీద అర్జెంటీనా గెలవడం.. ఆ ఆరోపణలకు స్పష్టమైన సమాధానం ఇచ్చినటైంది. ముఖ్యంగా మెస్సి ఇంగ్లాండ్ జట్టు మీద ఆడిన తీరు.. ఒకప్పటి మారడోనాను గుర్తుకు తెచ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular