https://oktelugu.com/

అనుష్క-విరాట్ కోహ్లీ ఏంటీ పని?

ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్ లో ఉన్న విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్ కు నెల రోజుల సమయం ఉండడంతో ఈ సెలవులను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కూతురు ‘వామిక’ పుట్టినప్పటినుంచి ఆమె ముఖాన్ని చూపించకుండా విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు తెగ సీక్రెట్ గా ఉంచుతున్నారు. అయితే తాజాగా ‘వామిక’ 6వ నెల బర్త్ డే ను ఇంగ్లండ్ లో ఘనంగా నిర్వహించారు విరాట్-అనుష్క దంపతులు. ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ ను తీసుకొచ్చి కట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 12, 2021 / 01:24 PM IST
    Follow us on

    ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్ లో ఉన్న విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్ కు నెల రోజుల సమయం ఉండడంతో ఈ సెలవులను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కూతురు ‘వామిక’ పుట్టినప్పటినుంచి ఆమె ముఖాన్ని చూపించకుండా విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు తెగ సీక్రెట్ గా ఉంచుతున్నారు.

    అయితే తాజాగా ‘వామిక’ 6వ నెల బర్త్ డే ను ఇంగ్లండ్ లో ఘనంగా నిర్వహించారు విరాట్-అనుష్క దంపతులు. ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ ను తీసుకొచ్చి కట్ చేశారు. ఇక పార్క్ లో కూతురుతో విరుష్క దంపతులు ఆడిపాడారు.ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

    ‘తన చిరునవ్వుతో మా చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం మారిపోతోంది. చిన్నారి పాపా.. నవ్వు మా జీవితాల్లో నింపిన ప్రేమ ఇలాగే కలకాలం ఉండిపోవాలి’ అంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ , విరాట్ భార్య అనుష్క పోస్టు చేసింది. వామికా 6 నెలల బర్త్ డే అంటూ చిన్నారితో దిగిన ఫొటోలు షేర్ చేసింది.

    అయితే విరాట్, అనుష్క అందులో కనిపించినా ఏ ఒక్క ఫొటోలోనూ వామిక ముఖం కనిపించకుండా అనుష్క జాగ్రత్త పడింది. దీనిపై నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ ‘ఇదేం బాగాలేదని.. ఇప్పటికైనా వామికను మాకు చూపించండి.. ఇలా చేశారేంటి?’ అంటూ అనుష్కను పెద్ద ఎత్తున కామెంట్లతో ప్రశ్నిస్తున్నారు. ఇలా చూపించి చూపించకుండా చేయడం కరెక్ట్ కాదంటున్నారు.