https://oktelugu.com/

ఏపీ అకౌంట్లో సొమ్మంతా లాగేసుకున్న ఆర్బీఐ, జీతాల కోసం మళ్లీ తిప్పలే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న రుణం అదీ. అయితే ఏపీ ప్రభుత్వం మ్యాజిక్ చేసింది. ఆంధ్రప్రదేశ్ తన లెక్కల్లో తెలంగాణ వాటాను కలిపి చూపించింది. దాంతో అధిక రుణం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం చేసిన ఈ పనికి కేంద్రం షాక్ ఇచ్చింది. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏపీ రుణపరిమితిలో కోత పెడుతున్నామని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. 2021-22లో ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిని కేంద్రం కేవలం రూ.27668 కోట్లకే పరిమితం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక […]

Written By:
  • NARESH
  • , Updated On : July 12, 2021 1:30 pm
    Follow us on

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న రుణం అదీ. అయితే ఏపీ ప్రభుత్వం మ్యాజిక్ చేసింది. ఆంధ్రప్రదేశ్ తన లెక్కల్లో తెలంగాణ వాటాను కలిపి చూపించింది. దాంతో అధిక రుణం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం చేసిన ఈ పనికి కేంద్రం షాక్ ఇచ్చింది. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏపీ రుణపరిమితిలో కోత పెడుతున్నామని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది.

    2021-22లో ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిని కేంద్రం కేవలం రూ.27668 కోట్లకే పరిమితం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. దానికి కారణాలను వివరించి షాక్ ఇచ్చింది. అప్పుగా తెచ్చుకున్న రూ.2వేల కోట్లతోపాటు, కేంద్రం ఇచ్చిన 1470 కోట్లను ఓవర్‌ డ్రాఫ్ట్‌ బకాయి కింద ఆర్బీఐ జమ చేసుకుంది. ఏపీ సర్కారు పరపతితో పాటు పరువూ పోయినట్లయింది. దీంతో పదో తారీఖు దాటినా ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం, విశ్రాంత ఉద్యోగాలు పెన్షన్ల కోసం ఎదురుచూపులు చేస్తున్నారు.

    2016-17 నుంచి 2019-20 వరకు తెలంగాణ వాటాగా చెల్లించిన అప్పునకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రుణం తెచ్చుకుంది. రూ.15025.03 కోట్లు అధికంగా రుణ పరిమితిని వినియోగించుకుందని గుర్తించినట్టు పేర్కొంది. ఇకపై ఏపీ రుణాల చెల్లింపు వివరాలు కేంద్రానికి మొత్తం ఏపీ వాటాను.. ఎంత మొత్తం తెలంగాణ వాటాను చెల్లిస్తున్నారనో తెలియజేయాలని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

    ఉమ్మడి ఏపీలో తీసుకున్న రుణాన్ని ఏపీ అధికారికంగా చెల్లిస్తోంది. తెలంగాణ ఈ రుణాన్ని ఏపీకి చెల్లిస్తే.. ఏపీ రెండూ కలిపి రుణాన్ని చెల్లించేది. అయితే తెలంగాణ చెల్లించే రుణాన్ని కూడా ఏపీ చెల్లించినట్టు చూపించి రుణం తీసుకోవడంతో ఇప్పుడు కేంద్రం చెక్ చెప్పింది. తెలంగాణ వాటాగా చెల్లించిన మొత్తం కూడా లెక్కల్లో ఆంధ్రప్రదేశ్ చెల్లించినట్టే ఉండడంతో ఈ మేరకు ఏపీకి అదనంగా రుణం తీసుకునే వెసులుబాటు లభించనుంది.

    ఇలా తెలంగాణ రుణాన్ని కూడా తానే చెల్లించినట్టు ఏపీ చూపి అధికం రుణం తీసుకోవడంతో చెక్ పడింది. అందుకే ఏపీ రుణపరిమితిని ఈ ఆర్థిక సంవత్సరం కేంద్రం కట్ చేసింది.