Odi World Cup 2023: ఇండియా మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ విజయంతో పాటు ఇండియన్ టీమ్ ఇప్పుడు మంచి జోష్ లో ఉంది. ఇక దాంతో ఈనెల 11వ తేదీన ఆఫ్గనిస్తాన్ మీద మరో మ్యాచ్ ఆడనుంది.ఈ మ్యాచ్ తో పాటుగా ఇండియన్ టీం ఈనెల 14వ తేదీన పాకిస్తాన్ పైన మరో మ్యాచ్ ఆడనుంది. అయితే ఇండియన్ టీం లో కీలక ప్లేయర్ అయిన శుభ్ మన్ గిల్ ఇప్పటికే డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నాడు కాబట్టి ఆయన మొదటి రెండు మ్యాచ్ లకి దూరంగా ఉండబోతున్నారు అనే విషయం ఇండియన్ టీమ్ హెడ్ కోచ్ అయినా రాహుల్ ద్రావిడ్ ఆఫీషియల్ గా తెలియజేయడం జరిగింది.
అయితే ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఆయన మూడో మ్యాచ్ అయిన పాకిస్తాన్ మీద కూడా ఆడే మ్యాచ్ లో అందుబాటు లో ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయనకి డెంగ్యూ ఫీవర్ రావడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ చాలావరకు తగ్గాయని దానివల్ల ఆయన నీరసంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి క్రమంలో ఆయన పాకిస్తాన్ టీం పైన మ్యాచ్ ఆడటం అనేది అసంభవం అనే చెప్పాలి. అందుకోసమే ఇండియన్ టీం లో ఆయన ప్లేస్ ని ఇషాన్ కిషన్ తో రీప్లేస్ చేస్తున్నారు. కానీ గిల్ లాంటి ఒక ప్లేయర్ ఇండియన్ టీం లో ఉంటే చాలా బాగుంటుందని ఇప్పటికే చాలామంది సీనియర్ ప్లేయర్లు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు.కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఆయన వరల్డ్ కప్ కి అందుబాటులో ఉండకుండా పోతున్నారు.
మూడు మ్యాచ్ లు మినహాయిస్తే మిగిలిన మ్యాచ్ ల నుంచి ఆయన అందుబాటులోకి వస్తారు అని నేషనల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. నిజానికి ఆయన ఫీవర్ వల్ల బాగా నీరసించి పోయాడు. కాబట్టి ఆయనకి కొద్ది రోజులు విశ్రాంతి ఇస్తేనే బాగుంటుందని డాక్టర్లు కూడా చెప్పినట్టు గా తెలుస్తుంది. అయితే శుభ్ మన్ గిల్ ఆడితే బాగుంటుంది అని కోరుకునే అభిమానులకు మాత్రం ఇది ఒక చేదు వార్త అనే చెప్పాలి. ఇక ఇండియన్ టీం లో ప్రస్తుతం ఉన్న ప్లేయర్లలో ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేసేవారు లేరు కాకపోతే తనకి ఆల్టర్ నెట్ గా ఉన్న ప్లేయర్ గా ఇషాన్ కిషన్ ఉన్నాడు. నిజానికి ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలంటే గిల్ చాలా వరకు కన్సిస్టెన్సీగా ఆడుతూ ఉంటాడు కాబట్టి కోహ్లీకి తోడుగా గిల్ కలిశాడంటే వీళ్ళిద్దరూ కలిసి ఎంత స్కోర్ అయినా సరే సెకండ్ ఇన్నింగ్స్ లో చేధిస్తారు. కాబట్టి గిల్ ఉంటే బాగుండేది అని చాలామంది ఇండియన్ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
నిజానికి పాకిస్తాన్ మీద ఆడే కీలక మ్యాచ్ లో కూడా ఆయన అందుబాటులో ఉండలేకపోతున్నారు అనే విషయం మాత్రం ఒక చేదు వార్త అనే చెప్పాలి.ఇక ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పటల్లో ఉన్నారు ఇక ఈ మూడు మ్యాచ్ ల తర్వాత ఆయన టీం కి అవలెబుల్ లో ఉంటారనే విషయం తెలుస్తుంది.ఇక కీలక మ్యాచ్ ల్లో మన స్టార్ ప్లేయర్ కి ఇలా అవ్వడం చాలా భాదని కలిగిస్తుందని వాళ్లు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.