Homeక్రీడలుక్రికెట్‌Andy Sandham Triple Century : 10 గంటలు.. 28 ఫోర్లు.. 325 రన్స్.. టెస్ట్...

Andy Sandham Triple Century : 10 గంటలు.. 28 ఫోర్లు.. 325 రన్స్.. టెస్ట్ ఫార్మాట్ లో ఇతడు విలయకారుడు!

Andy Sandham Triple Century : దాదాపు పది గంటల పాటు అతడు బ్యాటింగ్ చేశాడు. బౌలర్లు బంతులు వేసి అలసిపోయినప్పటికీ.. అతడు మాత్రం స్థిరంగా నిలబడ్డాడు. సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలో ఈ ఇన్నింగ్స్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. 39 సంవత్సరాల వయసులో ఈ ఘనత అందుకున్న ఆటగాడి పేరు అండి సాంధమ్.. ఇంగ్లీష్ జట్టులో ఒకప్పుడు కీలక ఆటగాడుగా ఇతడు ఆడాడు. అదే కాదు సుదీర్ఘ ఫార్మాట్లో తొలి త్రిపుల్ సెంచరీ చేసిన బ్యాటర్ గా అతడు రికార్డు సృష్టించాడు. 1930 లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. అరేబియన్ జట్టు పర్యటనలో భాగంగా అతడు ఈ రికార్డు సృష్టించాడు. అయితే అప్పటివరకు కరేబియన్ జట్టు తన తొలి టెస్ట్ విజయాన్ని అమలు చేయలేదు. అయితే నాటి కాలంలో ఇంగ్లీష్ జట్టు కరేబియన్ జట్టుతో నాలుగు టెస్టులు ఆడింది. జమైకా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో సాంధమ్ త్రి శతకం సాధించాడు. అయితే ఈ మ్యాచ్ డ్రా అయింది. సాంధమ్ కెరియర్ లో ఇది చివరి టెస్ట్ కావడం విశేషం. 39 సంవత్సరాల వయసులో అతడు ఈ ఘనత సాధించాడు. ఏ మాత్రం అలసిపోకుండా పరుగులు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లకు మైదానంలో నరకం చూపించాడు. ఎండలు మండే కరేబియన్ దేశంలో తన సామర్థ్యాన్ని ఏమిటో చూపించాడు. కవర్ డ్రైవ్ లు,హుక్ షాట్ లు, సింగిల్స్, క్విక్ డబుల్స్ తీసి అదరగొట్టాడు.

Also Read : ఇంగ్లీష్ జట్టుకు చుక్కలు చూపించాడు.. సాన పెడితే బుమ్రా వారసుడవుతాడు!

అయితే నాటి రోజుల్లో టెస్ట్ క్రికెట్ ఐదు రోజులు ఉండేది కాదు. ఆ కాలంలో రోజులతో సంబంధం లేకుండా సుదీర్ఘ ఫార్మాట్ ఆడేవారు. రిజల్ట్ వచ్చేవరకు మ్యాచ్ లు కొనసాగేవి. అలాంటి పరిస్థితుల్లో కూడా సాంధమ్ బ్యాటింగ్ చేయడం విశేషం. నాటి మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టు తరఫున సాంధమ్, అమెస్ అనే ఆటగాడితో కలిసి ఐదో వికెట్ కు 106 పరుగులు జోడించాడు. అమెస్ అవుట్ అయినప్పటికీ.. లెగే అనే ఆటగాడితో కలిసి సాంధమ్ ఆరో వికెట్లు 154 పరుగులు, హమ్మండ్ తో కలిసి ఏడో వికెట్ కు 111 పరుగులు, చాప్ మన్ తో కలిసి ఎనిమిదో వికెట్ కు 100 పరుగులు జోడించాడు. కరీబియన్ బౌలర్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఒక రకంగా వారికి బౌలింగ్ చేసే సామర్థ్యాన్ని దూరం చేశాడు.. నాటి మ్యాచ్లో సాంధమ్ ఏకంగా 325 పరుగుల స్కోర్ చేశాడు. మొత్తం 10 గంటలకు మించి అతడు బ్యాటింగ్ చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది తొలి త్రిపుల్ సెంచరీగా నమోదయింది. అయితే అతడి 325 పరుగుల ప్రస్థానంలో 28 ఫోర్లు ఉండడం విశేషం. ఇక ఈ మ్యాచ్ తర్వాత సాంధమ్ మళ్లీ క్రికెట్ ఆడలేదు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version