Anand Mahindra On Siraj: నువ్వు క్లాస్ బాసూ.. ఆనంద్ మహీంద్రా భావోద్వేగ ట్వీట్

సిరాజ్ ఈ ఘనత సాధించిన నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. నువ్వు క్లాస్ బాసూ అనే రీతిలో స్పందించారు.." ఒక్కటే మాట. క్లాస్.. అంతే.. ఈ క్లాస్ అనేది మీ సంపద లేదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు.

Written By: Bhaskar, Updated On : September 19, 2023 8:37 am

Anand Mahindra On Siraj

Follow us on

Anand Mahindra On Siraj: ఆసియా కప్_23 ను భారత్ సునాయాసంగా గెలిచింది. ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టును వారి సొంత మైదానంలో 50 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. ఈ విజయంలో హైదరాబాదీ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ కీలకపాత్ర పోషించాడు. ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు, మ్యాచ్ మొత్తం కలిపి ఆరు వికెట్లు తీశాడు. నీతో రాత్రికి రాత్రి హీరోగా మారిపోయాడు. తన ఎక్స్ ప్రెస్ బౌలింగ్ తో శ్రీలంక టాప్ ఆర్డర్ ను కుప్ప కూల్చాడు. భారత జట్టు సభ్యుడిగా ఆసియా కప్ సాధించడంలో మ్యాజిక్ చేయడం మాత్రమే కాదు.. తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 5 వేల డాలర్ల ప్రైజ్ మనీని కొలంబో మైదాన సిబ్బందికి విరాళంగా ప్రకటించి మరింత ఎత్తుకు ఎదిగాడు. దీంతో సిరాజ్ పై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.

సిరాజ్ ఈ ఘనత సాధించిన నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. నువ్వు క్లాస్ బాసూ అనే రీతిలో స్పందించారు..” ఒక్కటే మాట. క్లాస్.. అంతే.. ఈ క్లాస్ అనేది మీ సంపద లేదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మీ నేపథ్యం ఏమిటి అనే దాని నుంచి రాదు. అది మీలోనే ఉంటుంది” అంటూ ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా ఇలా ట్విట్ చేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లు వెత్తుతున్నాయి. సరైన సమయంలో స్పందించారంటూ నెటి జన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాచ్లో సిరాజ్ వన్ మ్యాన్ కూడా మహీంద్రా స్పందించారు. అయితే ఈ రైసింగ్ స్టార్ కు దయచేసి ఎస్ యూ వీ ఇచ్చేయండి సార్ అంటూ ఒక యూజర్ కోరగా.. 2021లో తాను మహీంద్రా థార్ ఇచ్చిన సంగతిని ఆనంద్ గుర్తుచేస్తూ బదులు ఇచ్చారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరాజ్ ఒకే ఓవర్ లో కీలకమైన నాలుగు గేట్లు తీశాడు. పది బంతుల వ్యవధిలో 5 వికెట్లు సాధించి అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. క్యాచ్ అవుట్, క్లీన్ బౌల్డ్, ఎల్ బీ డబ్ల్యు.. ఇలా పలు విధాలుగా శ్రీలంక ఆటగాళ్ళను అవుట్ చేసి మ్యాచ్ భారత్ వైపు మొగ్గేలా చేశాడు. సిరాజ్ కీలకమైన వికెట్లు తీయడంతో మిగతా బౌలర్లు బుమ్రా, హార్దిక్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది.