Aditya L1: భూమికి వీడ్కోలు పలికిన ఆదిత్య ఎల్_1.. కీలక నిర్ణయం తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

చంద్రయాన్_3 విజయవంతం తర్వాత ఇస్రో సూర్యుడిని పరిశోధించేందుకు సెప్టెంబరు 2న ఆదిత్య ఎల్_1 ప్రయోగం చేపట్టింది. పీఎస్ఎల్వీ_ సీ_57 అక్క నూక ద్వారా ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టింది.

Written By: Bhaskar, Updated On : September 19, 2023 8:28 am

Aditya L1

Follow us on

Aditya L1: సూర్యుడి రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఆదిత్య ఎల్_1 లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఆదిత్య ఎల్_1 ఉపగ్రహ కక్ష్య ను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్ లంగ్రిజియన్ పాయింట్_1 దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఇస్రో తాజాగా ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసిందిట్రాన్స్ లంగ్రిజియన్ పాయింట్_1 విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ప్రకటించింది. ప్రస్తుతం వాహక నౌక పాయింట్_1 దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహ భూ కక్ష్యను నాలుగు సార్లు పెంచారు. రాజాగా ఐదవ సారి కక్ష్యను పెంచి సూర్యుడి దిశలోనే లంగ్రాజ్ పాయింట్_1 వైపు వెళ్ళే విధంగా విన్యాసం చేశారు. 110 రోజుల ప్రయాణం అనంతరం ఆదిత్య ఎల్_1ను మరొక విన్యాసంతో లంగ్రాజ్ పాయింట్_1చుట్టూ ఉన్న కక్ష్య లో ప్రవేశపెడతారు.

చంద్రయాన్_3 విజయవంతం తర్వాత ఇస్రో సూర్యుడిని పరిశోధించేందుకు సెప్టెంబరు 2న ఆదిత్య ఎల్_1 ప్రయోగం చేపట్టింది. పీఎస్ఎల్వీ_ సీ_57 అక్క నూక ద్వారా ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టింది. ఔరా వాతావరణాన్ని లోతుగా పరిశోధించడం ఈ ఉపగ్రహం లక్ష్యం. భారత్ తరఫున సూర్యుడిని అధ్యయనం చేసే ఇస్రో మిషన్ ఇదే. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్_1 చేరిన తర్వాత దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ సూర్యుడిపై పరిశోధనలు మొదలుపెడుతుంది. కరోనాగ్రఫీ అనే పరికరంతో సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేస్తుంది. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సహాయంతో ఇస్రో మిషన్ ను చేపడుతోంది. ఇందులోని శాటి లైట్ బరువు 1500 కిలోలు. ఆదిత్య ఎల్_1 ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్1( ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్య లోకి ప్రవేశపెడతారు. ఈ ఆదిత్య ఎల్ _1 మొత్తం 7 పే లోడ్లను నింగిలోకి మోసుకెళ్ళుతుంది. అవి 1. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనా గ్రాఫ్, 2. అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, 3. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పెరి మెంట్, 4 ప్లాస్మా అన లైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, 5. సోలార్ లో- ఎనర్జీ ఎక్స్ రే స్పెక్ట్రో మీటర్, 6. హై ఎనర్జీ ఎల్_1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రో మీటర్, మాగ్నె టో మీటర్. సూర్య గోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా వీటిని రూపొందించారు.

ఎలా పనిచేస్తాయంటే

ఈ ఏడు పే లోడ్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సహాయంతో.. సూర్యుడిలోని పొరలైన పోటో స్పియర్(కాంతి మండలం), క్రోమో స్పియర్(వర్ణ మండలం), వెలుపల ఉండే కరోనాను ఇవి అధ్యయనం చేస్తాయి. మొత్తం నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తే.. మిగతా మూడు పేలోడ్స్ సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి. పీఎస్ ఎల్ వీ_సీ57అనే వాహన నౌక ఈ ఆదిత్య ఎల్_1 ను మోసుకుని నింగిలోకి దూసుకెళ్తుంది. 177 రోజులపాటు ఇది ప్రయాణం చేస్తుంది..ఆ కక్ష్య లోకి చేరుకుంటుంది. గతంలో అమెరికా, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సూర్యుడి పైకి ఉపగ్రహాలు పంపాయి.. ఆదిత్య ఎల్_ 1 ద్వారా భారత్ ఇప్పుడు చరిత్ర సృష్టించడానికి రెడీ అయింది.