IPL 2024 Auction: ఐపీఎల్ పండుగ మళ్లీ మొదలవుతుంది. 2024 కు సంబంధించిన ఐపీఎల్ మ్యాచ్ లు మార్చ్ లో ప్రారంభమవగా ఆ సీజన్ కు సంబంధించిన మినీ ఆక్షన్ ని ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. ఈ ఆక్షన్ ని దుబాయ్ లోని కోకా కోలా అరేనా వేదికగా నిర్వహిస్తున్నారు. ఇక భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ వేలమనేది ప్రారంభం అవుతుంది.ఇక ఈ వేలంలో 1166 మంది ప్లేయర్లు పాల్గొన్నప్పటికీ అందులో షార్ట్ లిస్ట్ చేసి 333 మంది ప్లేయర్లకి కుదించారు.
మొత్తం 10 ప్రాంచైజ్ లు కలిపి 77 స్థానాల వరకు ఖాళీగా ఉన్నాయి. అందులో 30 మంది ఓవర్సీస్ ప్లేయర్ల స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ సారి ఒక్కొక్క ఫ్రాంచైజ్ ఒక్కో టైప్ ఆఫ్ ప్లేయర్లను తీసుకోవడానికి మొదటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుని పెట్టుకున్నాయి. కొన్ని ఫ్రాంచైజీస్ కి బౌలర్లు కావాల్సి ఉండగా, మరికొన్ని ఫ్రాంచైజ్ లకు బ్యాట్స్ మెన్స్ అలాగే ఆల్ రౌండర్లు కావాల్సి ఉంది.
అందు కోసమని ఎవరెవరిని తీసుకోవాలి అనే ఉద్దేశ్యంలో ఆయా టీమ్ లు ముందే ప్రణాళికలను సిద్ధం చేసుకుని పెట్టుకున్నాయి. వాళ్లకు సంబంధించిన ప్లేయర్లు వాళ్ళు అనుకున్న రేట్ కి అందుబాటులో ఉంటే తీసుకుంటారు లేదంటే దానికి ఆల్టర్నేట్ గా కొంతమంది ప్లేయర్లను కూడా తీసుకోవాలనే ఉద్దేశ్యం తో ప్లాన్ చేసుకున్నారు…ఇక ఈసారి వేలంలో ఆక్షనీర్ గా మల్లికా సాగర్ వ్యవహరించనుంది. తొలి మహిళా ఆక్షనీర్ గా కూడా ఆమె నిలిచింది. ఇక ఈ వేలం లో అత్యధిక పర్స్ వాల్యూ కలిగి ఉన్న టీం గా గుజరాత్ టైటాన్స్ టీం 38.15 కోట్ల పర్స్ వాల్యూ ఉంది.ఇక అత్యల్పంగా లక్నో సూపర్ జయింట్స్ వద్ద 13.15 కోట్ల పర్స్ వాల్యూ ఉంది…
ఇక ఈసారి చాలా మంది ప్లేయర్లని తీసుకోవాలని ఆయా ఫ్రాంచైజ్ లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాకు చెందిన ఓపెనర్ ప్లేయర్ అయిన ట్రావెస్ హెడ్ ని చాలా టీమ్ లు టార్గెట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఇండియా మీద ఆడిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో చాలా అద్భుతమైన ప్రదర్శనని కనబరిచాడు. కాబట్టి ఆయన ఆట తీరు అందరికీ నచ్చింది. దాంతో ఆయన్ని ఆయా ఫ్రాంచైజ్ లు తమ టీం లోకి తీసుకోవాలని అరాటపడుతున్నాయి. ఈసారి వేలంలో అత్యధిక ధర కలిగిన ప్లేయర్ గా కూడా ట్రావిస్ హెడ్ నిలువబోతున్నట్టు గా తెలుస్తుంది…