Alcaraz Vs Djokovic: ఆధునిక టెన్నిస్లో జకో విచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రెంచ్, యూ ఎస్, ఆస్ట్రేలియన్, వింబుల్డన్.. ఇలా ప్రతి టోర్నీలో అతడు అదరగొట్టాడు. సరికొత్త రికార్డులు సృష్టించి అద్భుతమైన ఆటగాడిగా అవతరించాడు.. అయితే అటువంటి ఆటగాడికి చుక్కలు చూపించాడు 24 సంవత్సరాల ఓ యువకుడు. యూ ఎస్ ఓపెన్ లో దిమ్మ తిరిగే రేంజ్ లో ఆట తీరు ప్రదర్శించాడు. టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. ఆధునిక టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ ను 6-4, 7-6(4), 6-2 సెట్ల తేడాతో ఓడించాడు. తద్వారా మూడవ గ్రాండ్ స్లామ్ ఫైనల్ కు చేరుకున్నాడు.
శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ఇద్దరు ఆటగాళ్లు పోటాపోటీగా మైదానంలో కదం తొక్కడంతో ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి మ్యాచ్ చూసారు. అయితే ప్రారంభం నుంచి చివరి వరకు అల్క రాజ్ మైదానంలో చురుకుగా కదిలాడు. చిరుత పులి వేగంతో పరుగులు పెట్టాడు. జకోవిచ్ తన అనుభవాన్ని మొత్తం రంగరించాడు. అందువల్లే వీరిద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. అయితే మ్యాచ్లో విజయం సాధించిన నేపథ్యంలో అల్క రాజ్ ఆదివారం జరిగే ఫైనల్ లో తలపడతాడు. ఫైనల్ లో సిన్నర్ లేదా అగర్ అలియాస్ సిమ్ తో పోటీపడాల్సి ఉంటుంది. మరో సెమి ఫైనల్ మ్యాచ్లో సిన్నర్ అలియాస్ పోటీపడాలి. ఈ మ్యాచ్ లో గెలిచిన వారితో అల్క రాజ్ పోటీ పడతాడు.. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కు అమెరికా అధ్యక్షుడు హాజరవుతారని తెలుస్తోంది. 2004 నుంచి 2008 వరకు యూఎస్ ఓపెన్ లో క్లోజర్ ఫెదరర్ వరుసగా ఐదు విజయాలు సాధించాడు. ఈ నేపథ్యంలో పురుషుల విభాగంలో తొలిసారిగా విజేతగా నిలవాలని సిన్నర్ భావిస్తున్నాడు. మరోవైపు తన ఆరో మేజర్ టైటిల్, ఫ్లషింగ్ మెడోస్ లో రెండవ టైటిల్ సాధించాలని అల్క రాజ్ ఆసక్తిగా ఉన్నాడు.
గత ఏడాది..
గత ఏడాది పారిస్ ఒలంపిక్స్ లో జకోవిచ్ తో జరిగిన రెండు మ్యాచ్లలో.. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ క్వార్టర్స్ ఫైనల్ లో అల్క రాజ్ కూటమిపాలయ్యాడు.. వాస్తవానికి ఈ మ్యాచ్లో గెలిచి తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవాలని భావించాడు.. అయితే అతడి ఆశలను ఆల్కరాజ్ అడియాసలు చేశాడు. ఈ మ్యాచ్ మొత్తం అద్భుతంగా సాగిందని.. యువ ఆటగాడితో పోటీని ఆస్వాదించానని.. ఫలితం వ్యతిరేకంగా వచ్చినప్పటికీ గొప్ప ఆట ఆడిన అనుభవం మిగిలిపోతుందని జకోవిచ్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్లో జకోవిచ్ శారీరకంగా కాస్త అసౌకర్యానికి గురయ్యాడు. ముఖ్యంగా షాట్ల ఎంపికలో అతడు తీవ్రంగా తడబడ్డాడు. ఒకానొక సందర్భంలో అతన్ని మెడనొప్పి తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.. అయినప్పటికీ తేరుకున్నాడు. మైదానంలో ప్రేక్షకులు ఎక్కువగా జకోవిచ్ కు మద్దతుగా ఉండడం మేర కలిసి వచ్చింది. వాస్తవానికి రెండవ సెట్ సమయంలో జకోవిచ్ 3 -0 తో కాసేపు లీడ్ కొనసాగించాడు. అయితే ఆల్కరాజ్ తేరుకున్నాడు. ఆ తదుపరి మూడు గేమ్ లు గెలుచుకున్నాడు.. దీంతో జకోవిచ్ కు ఓటమి తప్పలేదు. రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్లో సిన్నర్ గనుక గెలిస్తే.. అల్క రాజ్ తో అతడికి పోటీ రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.
Carlos Alcaraz enters a tournament.
Carlos Alcaraz reaches the final.For the eighth time in a row. pic.twitter.com/PbkWpjhIbu
— US Open Tennis (@usopen) September 5, 2025