Akash Deep Singh: బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో అతడికి భారత తరఫున తొలి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది.. అతడు అంతకుముందు ఐపీఎల్ లో ఆడినప్పటికీ గొప్ప రికార్డేమీ లేదు. ఈ నేపథ్యంలో అతనికి అనూహ్యంగా భారత్ తరఫున ఆడే అవకాశం వచ్చింది. రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ లో అతడు బౌలర్ గా అరంగేట్రం చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు 9.1 ఓవర్లలో 47 పరుగులు చేసింది. ఒకరకంగా సిరాజ్, ఆకాష్ పై ఇంగ్లాండ్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. వాస్తవానికి అంతకుముందే ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయేది.
రాంచి వేదికగా తన టెస్ట్ అరంగేట్రం చేసిన ఆకాష్ రెండో ఓవర్ లో అద్భుతమైన బంతివేసి ఇంగ్లాండ్ బ్యాటర్ జాక్ క్రాలీ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అతడు వేసిన ఇన్ స్వింగర్ ధాటికి ఆఫ్ స్టంప్ గాల్లో ఎగిరింది. ఆ బంతిని చూసి జాక్ క్తాలీ సైతం ఆశ్చర్యపోయాడు. ఆ రంగేట్ర మ్యాచ్ లో తొలి వికెట్ తీయడంతో ఆకాష్ ఎగిరి గంతేశాడు. కానీ ఆ ఆనందం అతడికి ఎంతో సేపు లేదు. సెకన్ వ్యవధిలోనే ఆ ఆనందం ఆవిరైపోయింది. ఎంపైర్ నో బాల్ అని ప్రకటించడంతో జాక్ క్రాలీ బతికిపోయాడు. ఆకాష్ నిరాశలో మునిగిపోయాడు.. అది నోబాల్ కాకుంటే జాక్ క్రాలీ ఔట్ అయ్యేవాడు. తద్వారా అరంగేట్ర మ్యాచ్ తొలి ఓవర్ లోనే వికెట్ తీసిన బౌలర్ గా ఆకాష్ రికార్డు సృష్టించేవాడు.
వికెట్ దక్కినట్టే దక్కి.. నోబెల్ రూపంలో దూరం కావడంతో ఆకాష్ నిరాశకు గురయ్యాడు. ప్రస్తుతం ఆ వికెట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పాపం ఆకాష్ అని నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జాక్ క్రాలీ కి లైఫ్ లభించడంతో చెలరేగి ఆడాడు. 42 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 42 పరుగులు చేశాడు.. చివరికి ఆకాష్ బౌలింగ్ లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగు పరుగుల వద్ద నో బాల్ రూపంలో బతికిపోయిన అతడు.. 42 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు..దీంతో నెటిజన్లు “4 పరుగుల వద్ద బతికిపోయాడు. 42 వద్ద ఔట్ అయ్యాడు” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
Akash Deep picked Maiden Test Wickets but it’s a No ball. pic.twitter.com/sqWTvHRIfP
— CricketMAN2 (@ImTanujSingh) February 23, 2024