Afghanistan Cricket:ప్రపంచకప్ టీ20 సమరానికి స్వరం సిద్ధమవుతున్న వేళ అప్ఘనిస్థాన్ క్రికెట్ కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న ప్రముఖ స్పిన్నర్ రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
నిన్న రాత్రి అప్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు తనను సంప్రదించకుండానే టీ20 ప్రపంచకప్ కు జట్టును ప్రకటించడంపై రషీద్ ఖాన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించి సంచలనం సృష్టించాడు.
‘అప్ఘనిస్తాన్ కెప్టెన్ గా, బాధ్యతాయుతమైన దేశ పౌరుడిగా.. జట్టు ఎంపికలో భాగం కావడం నా హక్కు. జట్టును ప్రకటించడానికి ముందు సెలక్షన్ కమిటీ, అప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నన్ను సంప్రదించలేదు. అప్ఘన్ టీ20 టీమ్ కెప్టెన్ పదవి నుంచి తక్షణం వైదొలుగుతున్నాను.. అయితే అప్ఘనిస్తాన్ తరుఫున ఆడడం నాకు ఎప్పుడూ గర్వకారణమే’ అంటూ సోషల్ మీడియాలో రషీద్ ఖాన్ పోస్ట్ పెట్టాడు.
రషీద్ ఖాన్ ను జులైలోనే టీ20 కెప్టెన్ గా నియమితులయ్యాడు. ప్రపంచకప్ కు కూడా అతడినే కెప్టెన్ గా నియమించగా.. తాజాగా అస్తవ్యస్తంగా జట్టును ఎంపిక చేసి.. తనను సంప్రదించలేదని వైదొలిగాడు.
తాలిబాన్లు అప్ఘనిస్తాన్ లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్ఘనిస్తాన్ లో పరిస్థితి అల్లకల్లోలంగా తయారైంది. దీంతో రషీద్ ఖాన్ నిర్ణయం అప్ఘన్ క్రికెట్ భవిష్యత్ ను మరింత ప్రమాదంలో పడేస్తోంది. ఇప్పటికే అప్ఘన్లను రషీద్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు జాతీయ జట్టు కెప్టెన్ పదవికి రాజీనామా చేయడం సంచలనమైంది.
అప్ఘనిస్తాన్ నేరుగా ప్రపంచకప్ టీ20కి ఎంపికైంది. భారత్ , న్యూజిలాండ్, పాకిస్తాన్, గ్రూపులో 4వ జట్టుగా అప్ఘనిస్తాన్ ఉంది. క్రికెట్ తో సంబంధం లేని వ్యక్తుల ప్రమేయం బోర్డులో ఎక్కువైందని ఆరోపిస్తూనే రషీద్ ఖాన్ కెప్టెన్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆ జట్టులో ఆడకపోయినా పలువురిని ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేశారు. అదే వివాదాస్పదంగా మారింది. 2016,2019లో నిషేధానికి గురైన పలువురిని ఎంపిక చేయడంతోనే రషీద్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
https://twitter.com/rashidkhan_19/status/1436014386636804098?s=20