IND vs SL : టి20 వరల్డ్ కప్, జింబాబ్వేతో టి20 సిరీస్ గెలిచిన తర్వాత భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శనివారం తొలి మ్యాచ్ ఆడింది. పల్లెకెలె వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. యశస్వి జైస్వాల్ (40: 21 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), గిల్(44: 16 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (58: 26 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లు), రిషబ్ పంత్ (49: 23 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్) సత్తా చాటారు. హార్దిక్ పాండ్యా (9), రియాన్ పరాగ్ (7), రింకు సింగ్ (1) దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో మతీష పతిరణ 4 వికెట్లు దక్కించుకున్నాడు. దిల్హన్ మధుశంక, అసిత ఫెర్నాండో, హసరంగ తలా ఒక వికెట్ సాధించారు.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలకడంతో.. ఈ మ్యాచ్లో గిల్, జైస్వాల్ ఓపెనర్లుగా వచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 74 పరుగులు జోడించారు. కేవలం 6.6 ఓవర్లలోనే వారు ఈ స్కోర్ చేయడం విశేషం. అయితే వేగంగా ఆడే క్రమంలో గిల్, జైస్వాల్ వరుస బంతుల్లో అవుట్ అయ్యారు. 74 పరుగుల వద్ద భారత జట్టు గిల్, జైస్వాల్ వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. గిల్ ను దిల్హన్ మధు శంక అవుట్ చేయగా, జైస్వాల్ ను హసరంగా పెవిలియన్ పంపించాడు. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్ వన్ డౌన్ బ్యాటర్ గా క్రీజ్ లోకి వచ్చాడు. రిషబ్ పంత్ తో కలిపి భారత జట్టు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 76 పరుగులు జోడించారు. భారత జట్టు స్కోరు 150 పరుగులకు చేరుకున్న తర్వాత సూర్య కుమార్ యాదవ్ మతిషా పతీరణ బౌలింగ్ లో వికెట్ల మందు దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ ను పతీరణ అవుట్ చేశాడు. రింకు సింగ్ అసిత ఫెర్నాండో బౌలింగ్ లో క్లీన్ బౌడర్ అయ్యాడు. అయితే చివర్లో వచ్చిన అక్షర్ పటేల్ ఐదు బంతుల్లో 10 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
అయితే ఈ మ్యాచ్లో శ్రీలంక బౌలర్ కమిందు మెండిస్ వేసిన బౌలింగ్ చర్చకు దారి తీసింది. ఇతడు 10 ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ను ఎడమచేతి వాటం బౌలింగ్ వేశాడు. అయితే అదే ఓవర్లో రిషబ్ పంత్ కు రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ వేసాడు. దీంతో మైదానంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది. క్రికెట్ నిబంధనల ప్రకారం ఒక బౌలర్ రెండు విధాలుగా బౌలింగ్ చేయడానికి యాంబి డెక్సేటేరిటీ (ambidexterity) అంటారు. క్రికెట్ పరిభాషలో ఒక బౌలర్ కుడి, ఎడమ చేతులతో సమానంగా బౌలింగ్ చేయడాన్ని యాంబి డెక్సేటేరిటీ అంటారు.. అయితే రెండు చేతులతోనూ బౌలింగ్ చేసిన కమిందు మెండిస్ ఒక ఓవర్ మాత్రమే వేసి, వికెట్లేమీ తీయకుండా తొమ్మిది పరుగులు సమర్పించుకున్నాడు.. కమిందు మెండిస్ కంటే ముందు శ్రీలంకకు చెందిన తిలక్ రత్నే అనే బౌలర్ కూడా యాంబి డెక్సే టేరిటీ విధానంలో బౌలింగ్ వేసి.. ఆ విధానంలో బౌలింగ్ వేసిన తొలి ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇక శ్రీలంక బౌలర్లలో మతీష పతిరణ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తీక్షణ సత్తా చాట లేకపోయాడు. అతడు నాలుగో ఓవర్ల పాటు బౌలింగ్ వేసి 44 పరుగులు ఇచ్చాడు. దిల్షాన్ మధుశంక మూడు ఓవర్లు వేసి 45 పరుగులు ఇచ్చి ఒక వికెట్ దక్కించుకున్నాడు. హసరంగ నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 25 పరుగులు ఇచ్చి ఒక వికెట్ దక్కించుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన ఘనతను హసరంగా దక్కించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో భారత జట్టు పవర్ ప్లే లో ఏకంగా 74 పరుగులు సాధించడం విశేషం. భారత విధించిన 214 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు కడపటి వార్తలు అందే సమయానికి 5 ఓవర్లలో వికెట్లు ఏమీ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. శ్రీలంక బాటర్లలో నిస్సాంక 30, కుశాల్ మెండిస్ 18 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
Kamindu Mendis bowling left arm to Suryakumar Yadav and right arm to Rishabh Pant. pic.twitter.com/ZBBvEbfQpS
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 27, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: According to the rules of cricket when a bowler bowls in two ways it is called ambidexterity
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com