Abhishek Sharma explosive batting: యువరాజ్ సింగ్ గురించి ఇండియన్ క్రికెట్ అభిమానులకు చెప్పాల్సిన అవసరం లేదు. అతడి ఆటను చూసిన తరమే కాదు.. ఈతరం కూడా అతడిని పిచ్చిపిచ్చిగా అభిమానిస్తూ ఉంటుంది.
ఎడమచేతి వాటం బ్యాటింగ్ తో సంచలన ఆటతీరు కొనసాగించే యువరాజ్ కోట్లాదిమందికి ఇష్టమైన ఆటగాడు. అతడు బ్యాటింగ్ ద్వారా మాత్రమే కాదు.. ఫీల్డింగ్, బౌలింగ్లో కూడా అదరగొట్టేవాడు. ఫీలింగ్ లో అయితే టీమిండియా జాన్డీ రోడ్స్ అని అతడిని పిలిచేవారు. మెరుపు వేగంతో బ్యాటింగ్ మాత్రమే కాదు.. అంతే వేగంతో అతడు బంతులను ఆపేవాడు. అందువల్లే అతడు ఎమర్జింగ్ ప్లేయర్ లాగా కనిపించేవాడు.
యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా నిత్యం వార్తలలోనే ఉంటున్నాడు. అతడి గురించి.. అతడి ఆట తీరు గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు టీమిండియాలో ముఖ్యంగా టి20 ఫార్మాట్లో సంచలనాలను సృష్టిస్తున్న అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ శిష్యుడు. ఇతడి సారథ్యంలోనే అభిషేక్ శర్మ ఈ స్థాయి ఆటగాడిగా రూపాంతరం చెందాడు. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న అతడు.. మెరుపు వేగానికి అసలు సిసలైన ప్రతీకగా మారాడు.
ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్లో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అతడు బ్యాటింగ్ విమర్శకులను సమ్మోహితులను చేస్తోంది. అభిషేక్ టీమిండియాలో అద్భుతమైన ఆటగాడిగా రూపాంతరం చెందడానికి ప్రధాన కారణం యువరాజ్ సింగ్.
అంతటి కరోనాలో కూడా అభిషేక్ శర్మ తన ప్రాక్టీస్ ఆపలేదు. పైగా వైవిద్య భరితమైన బంతులను అతడు ఆడేవాడు. నెట్స్ లో తీవ్రంగా సాధన చేసేవాడు. ఎటువంటి బంతులనైనా ఎదుర్కొనే విధంగా తనను తాను సాన పెట్టుకునేవాడు. ఏమాత్రం భయపడకుండా బ్యాటింగ్ చేయడం ఎలాగో యువరాజ్ నుంచి నేర్చుకున్నాడు. అందువల్లే అభిషేక్ శర్మ ఈ స్థాయిలో ఆకట్టుకుంటున్నాడు.
ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడవ వన్డేలో అతడు కేవలం 14 బంతులలోనే చేశాడు. అయితే అతడు ఈ స్థాయిలో అదరగొట్టినప్పటికీ యువరాజ్ అంతగా అభినందించలేదు. నా రికార్డు బద్దలు కొట్టలేక పోయావంటూ అతడిని ఆటపట్టించాడు. అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లో ఉండడంతో సన్ రైజర్స్ జట్టు యజమాని కావ్య మారన్ ఎగిరి గంతులు వేస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ జట్టులో ఓపెనర్ గా అభిషేక్ శర్మ ఉన్నాడు.