Homeక్రీడలుక్రికెట్‌Abhishek Sharma: అభిషేక్ శర్మ ఓవర్ నైట్ స్టార్ కాదు.. దాని వెనుక ఇంతటి కష్టం

Abhishek Sharma: అభిషేక్ శర్మ ఓవర్ నైట్ స్టార్ కాదు.. దాని వెనుక ఇంతటి కష్టం

Abhishek Sharma: టి20 వరల్డ్ కప్ లో.. ఇప్పటివరకు అభిషేక్ శర్మ తన స్థాయి ఇన్నింగ్స్ ఆడలేదు. రెండు మ్యాచ్లలో కూడా సున్నా పరుగులకు అవుట్ అయ్యాడు. ఇటీవల ఆరు ఇన్నింగ్స్ లలో అభిషేక్ శర్మ తన స్థాయి ఆట తీరు ప్రదర్శించలేదు. ఒకరకంగా ఇది అభిమానులకు వెలితి. అయినంత మాత్రాన అభిషేక్ శర్మ మీద అభిమానులకు అంచనాలు తగ్గలేదు. మేనేజ్మెంట్ కూడా అతని వైఫల్యాలను పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు.

అభిషేక్ శర్మ ఫామ్ ను నమ్మడు. ఎందుకంటే అతడు ఎలా ఆడతాడో అందరికీ తెలుసు. మైదానంతో అతడికి సంబంధం ఉండదు. బౌలర్ ఎవరనేది అతడి మైండ్లో ఉండదు. అతనికి తెలిసింది కేవలం గట్టిగా కొట్టడమే. తనదైన రోజు మాత్రమే కాదు.. తనది కాని రోజు కూడా అభిషేక్ శర్మ దుమ్ము రేపుతాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తాడు. పరుగుల వరద పారిస్తూ ఉంటాడు. అందువల్లే అభిషేక్ శర్మను టీమిండియా పరుగుల యంత్రం లాగా అభివర్ణిస్తూ ఉంటారు.

అభిషేక్ శర్మ మైదానంలో తీవ్రంగా సాధన చేస్తాడు. ఖాళీ సమయం దొరికితే చాలు మైదానంలో వాలిపోతాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా మైదానంలోనే గడుపుతాడు. తన లోపాలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ఉంటాడు. బ్యాటింగ్ చేసే విధానంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ ఉంటాడు. అభిషేక్ శర్మ యువరాజ్, అతడి తండ్రి యోగ్ రాజ్ వద్ద శిష్యరికం చేశాడు. అందువల్లే అతడు దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు.. బీభత్సంగా పరుగులు సాధిస్తూ ఉంటాడు. అందువల్లే అభిషేక్ శర్మ టి20 టీమిండియా కు ప్రధాన బ్యాటర్ గా అవతరించాడు.

మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో కూడా అభిషేక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. కాకపోతే బ్యాట్ ను ఏటవాలుగా పెట్టి ఎడ్జ్ మీద బంతిని అటూ ఇటూ కొడుతూ ఉంటాడు. మోకాళ్ళ మీద కూర్చుని
.. అదే పనిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. దీనివల్ల అభిషేక్ ఒత్తిడిని తగ్గించుకుంటాడు. బంతిమీద మరింత పట్టు సాధించడానికి ఇది ఉపకరిస్తుందని భావిస్తూ ఉంటాడు. టీమిండియాలో మిగతా ప్లేయర్లు మైదానంలో నేరుగా అడుగు పెడుతుంటారు. కానీ అభిషేక్ శర్మ మాత్రం వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడు. పైగా తనమీద తాను పూర్తిస్థాయిలో నియంత్రణ సాధించి.. అనంతరం బ్యాటింగ్ మొదలుపెడతాడు.

అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేయడం వెనక ఇదిగో ఇంతటి కష్టం ఉంది. అతడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేస్తాడు. అరుదైన సందర్భాల్లో మినహా.. మిగతా సమయాలలో అతడి బ్యాటింగ్ అద్భుతం. అమోఘం. అనన్య సామాన్యం. అందువల్లే అతడిని చాలామంది ప్రేమిస్తుంటారు. అతని బ్యాటింగ్ ను ఇష్టపడుతుంటారు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular