Homeక్రీడలుక్రికెట్‌Abhishek Sharma T20 World Cup Final Innings: అప్పుడు విరాట్ కోహ్లీ.. ఇప్పుడు అభిషేక్...

Abhishek Sharma T20 World Cup Final Innings: అప్పుడు విరాట్ కోహ్లీ.. ఇప్పుడు అభిషేక్ శర్మ.. ఇది మామూలు ఘనత కాదు

Abhishek Sharma T20 World Cup Final Innings: ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అంతగా ఫామ్ లో లేడు. వాస్తవానికి అతడు వరుసగా విఫలమవుతూ తన స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నాడు. తనమీద మేనేజ్మెంట్ నమ్మకం ఉంచి వరుసగా అవకాశాలు ఇచ్చింది. అయితే వచ్చిన అవకాశాలను అతడు అంతగా ఉపయోగించుకోలేదు. దీంతో ఫైనల్ మ్యాచ్ కు ముందు అతడిని తుది జట్టులో ఉంచడం పట్ల విమర్శలు వ్యక్తం అయ్యాయి. మాజీ క్రికెటర్లు కొందరు అతనికి అవకాశాన్ని ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!

అభిషేక్ శర్మ ఫైనల్ మ్యాచ్లో దుమ్మురేపాడు. 21 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. తొలి ఓవర్ లో సంజు శాంసన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. తొలి ఓవర్లో 7 పరుగులు.. రెండవ ఓవర్ లో 5 పరుగులు వచ్చాయి. ఇక నాలుగో ఓవర్ నుంచి అభిషేక్ తన విశ్వరూపం చూపించాడు. ఇక అప్పటినుంచి అభిషేక్ శర్మ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఫెర్గు సన్ బౌలింగ్లో ఊచకోత కోశాడు. ఈ క్రమంలోనే 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా తన మీద ఉన్న ఒత్తిడి మొత్తం తగ్గించుకున్నాడు. ఫైనల్ మ్యాచ్లో మేనేజ్మెంట్ తన మీద ఉంచుకున్న నమ్మకాన్ని కాపాడుకున్నాడు. తొలి రెండు ఓవర్ల పాటు నిదానంగా బ్యాటింగ్ చేసిన అభిషేక్.. ఆ తర్వాత తన గేర్ మొత్తం మార్చేశాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసి తన స్టామినా నిరూపించుకున్నాడు. సంజు మీద ఒత్తిడి తగ్గించి.. తను మాత్రం స్ట్రైక్ తీసుకున్నాడు. తద్వారా టీమిండియా స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది.

అభిషేక్ ఆడిన ఇన్నింగ్స్.. 2024 t20 వరల్డ్ కప్ ఫైనల్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ను తలపిస్తోంది. విరాట్ కోహ్లీ 2024 t20 వరల్డ్ కప్ లో అంతగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో అతడికి జట్టులో స్థానం ఇవ్వడం పట్ల విమర్శలు వచ్చాయి. అయితే ఫైనల్ మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీ ఫామ్ గురించి రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీకి ఫాంతో సంబంధం లేదని.. అతడు లైన్లోకి వస్తే పరుగుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. దానికి తగ్గట్టుగానే ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేశాడు. రోహిత్ లాంటి ఆటగాళ్లు విఫలమైనప్పటికీ.. అక్షర్ పటేల్ తో కలిసి సూపర్ ఇన్నింగ్స్ నిర్మించాడు. దీంతో టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా ఎదుట భారీ లక్ష్యాన్ని విధించింది. చివరి వరకు పోరాడి విజేతగా నిలిచింది. ఇక ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లోనూ అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. కానీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం అదరగొట్టాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version