Abhishek Sharma: సార్ నాథ్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కిందంటే చాలు దూసుకుపోవడమే.. అది మామూలు స్టేషన్లో ఆగదు. పెద్ద స్టేషన్లలో ఎక్కువసేపు నిలబడదు.. దానికి తెలిసిందల్లా వేగంగా దూసుకుపోవడమే. ఇదే ఉపమానాన్ని ఆధునిక క్రికెట్లో t20 ఫార్మాట్ కు అన్వయిస్తే.. దానికి అభిషేక్ శర్మ అని పేరు పెట్టొచ్చు..
టి20 ఫార్మేట్ లో అభిషేక్ శర్మ నెంబర్ వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతడికి ఫాంతో సంబంధం లేదు. మైదానంతో సంబంధం లేదు. బౌలర్లతో కూడా సంబంధం లేదు. ఎలాగైనా ఆడగలడు.. ఎక్కడైనా ఆడగలడు. కంటే విధ్వంసమే తన ఇంటిపేరు కాబట్టి.
సాధారణంగా అభిషేక్ శర్మ ఎక్కువసేపు మైదానంలో ఉండడానికి ఇష్టపడడు. ఉన్నంత సేపు లయకారుడిలాగా బ్యాటింగ్ చేస్తూనే ఉంటాడు. బంతి స్లాట్ లో పడిందా.. దూసుకు వచ్చిందా అనేది అతనికి సంబంధం లేదు.. వన్స్ అతడు బ్యాట్ మూవ్ అయిందంటే బంతి గాల్లోకి లేవాల్సిందే. గట్టిగా కొడితే స్టాండ్ అవతలపడుతుంది. పవర్ జనరేట్ చేయకపోతే ఫీల్డర్ చేతిలో పడుతుంది. ఎప్పుడో ఒకసారి అతడు క్లీన్ బౌల్డ్ అవుతాడు. అదృష్టం బాగోలేకపోతే వికెట్ల ముందు దొరికిపోతాడు. వేగంగా ఆడే అభిషేక్.. చివరి వరకు బ్యాటింగ్ చేసిన దాఖలాలు చాలా తక్కువ. ఉన్నంతలో సరిపెట్టుకోడు. తాను ఉన్నంత సేపు అనుకున్న దానికంటే ఎక్కువ రావాలని కోరుకుంటాడు. అందువల్లే అతని బ్యాట్ నుంచి పరుగులు భారీగా వస్తూ ఉంటాయి.
తొలిసారిగా ఈ ఐపీఎల్లో అభిషేక్ శర్మ ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్నాడు. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 135* పరుగులు చేశాడు. 10 ఫోర్లు, పది సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. వాస్తవానికి అభిషేక్ శర్మ చివరిదాకా నిలబడడం అతడికే కాదు, అభిమానులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నను మ్యాచ్ ముగిసిన తర్వాత వ్యాఖ్యాత అభిషేక్ శర్మను అడిగాడు.
” మీరు వేగంగా ఆడతారు. త్వరగానే అవుట్ అవుతారు. కానీ ఈరోజు మ్యాచ్లో చివరి వరకు ఉన్నారు. ఆశ్చర్యంగా ఉంది. డెత్ ఓవర్లలో సమర్థవంతంగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నారా” అని ప్రశ్నించారు.. దానికి అభిషేక్ శర్మ నవ్వుతూ” నాకు ప్రారంభ ఓవర్లలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం నేర్పించారు. మధ్య ఓవర్లలో కూడా గట్టిగా ఆడాలని చెప్పారు. డెత్ ఓవర్లలో ఇలా బ్యాటింగ్ చేయాలని నాకు ఎప్పుడూ చెప్పలేదు. డెత్ ఓవర్లలో ఎలా బ్యాటింగ్ చేయాలో ఇప్పుడు అర్థమైందని” అభిషేక్ సమాధానం చెప్పాడు. దీంతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు.