Vinesh Phogat : పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో రీజనింగ్ పోటీలలో భారత క్రీడాకారిణి వినేశ్ ఫొగాట్ ఫైనల్ వెళ్ళింది. మెడల్ ఖాయం అనుకుంటున్న క్రమంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఆమె పోటీ పడుతున్న విభాగంలో బరువు 100 గ్రాములు ఎక్కువ ఉందని ఒలింపిక్ నిర్వాహకులు వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు విధించారు. దీంతో ఆమె బోరున విలపించింది. దేశం యా వత్తు దిగ్భ్రాంతికి గురైంది. సెమీ ఫైనల్ లో వినేశ్ ఫొగాట్ అద్భుత ప్రదర్శన చూపింది. నేరుగా ఫైనల్ దూసుకెళ్లింది. ఫైనల్లో కచ్చితంగా మెడల్స్ సాధిస్తుంది అనుకుంటున్న తరుణంలో.. ఒక్కసారిగా ఆమె 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందని నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. దీంతో ఆమె ఫైనల్ పోరుకు దూరమైంది. అంతేకాదు మెడల్ కూడా పొందకుండా రిక్త హస్తాలతో వెనక్కి రావలసి వచ్చింది. అయితే వినేశ్ ఫొగాట్ విషయంలో ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వినేశ్ ఫొగాట్ పెదనాన్న మహావీర్ స్పందించారు.. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
“వినేశ్ ఫొగాట్ సెమీఫైనల్ లో అద్భుతంగా ప్రదర్శన చూపింది. దీంతో మేము గోల్డ్ మెడల్ సాధిస్తుంది అనుకున్నాం. మేము మాత్రమే కాదు దేశం మొత్తం కూడా ఆమె మెడల్ సాధిస్తుందని ఆశతో ఎదురు చూసింది. వాస్తవానికి రెజ్లింగ్ పోటీలో ఎవరైనా రెజ్లర్ 50 నుంచి 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆడేందుకు అనుమతి ఉంటుంది. అయితే పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో నిబంధనలు విభిన్నంగా ఉన్నాయి. ఫలితంగా ఆమెపై వేటపడింది. దేశ ప్రజలు ఈ సమయంలో ఆమెకు అండగా ఉండాలి. ఏమాత్రం నిరాశ చెందవద్దు. ఏదో ఒక రోజు ఆమె దేశం కోసం తప్పకుండా మెడల్ సాధిస్తుంది. ఆమెను తదుపరి ఒలింపిక్స్ కోసం మేము సన్నద్ధం చేస్తామని” మహావీర్ ప్రకటించారు.
మహావీర్ మాదిరిగానే ఒలింపిక్ విజేత విజేందర్ సింగ్ కూడా వినేశ్ ఫొగాట్ 100 గ్రాముల బరువుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “రెజ్లింగ్ పోటీలో రెజ్లర్ కాస్త బరువు ఎక్కువగా ఉన్నప్పుడు రకరకాల కసరత్తులు చేస్తుంటారు. ఇది సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే మనిషి శరీరంలో బరువు అనేది ప్రత్యేక అవయవం ద్వారానే సమకూరదు. రెజ్లింగ్ విభాగంలో బరువు ఎక్కువగా ఉన్నప్పుడు రెజ్లర్లు స్టీమ్ బాత్ చేస్తారు. అదేపనిగా రన్నింగ్ చేస్తారు. డైట్ విషయంలో డిన్నమైన నిబంధనలు పాటిస్తారు. వాటి వల్ల బరువు తగ్గించుకోవచ్చు.వినేశ్ ఫొగాట్ విషయంలో 100 గ్రాములు బరువు ఉన్నట్టు ఒలింపిక్ నిర్వాహకులు చెబుతున్నారు. దీన్ని సాకుగా చూపి ఆమెపై అనర్హత వేటు విధించడం అస్సలు సరికాదు. బాక్సింగ్ విభాగంలో బరువు తగ్గించుకునేందుకు బాక్సర్లకు గంటకు పైగా టైం ఇస్తారు..వినేశ్ ఫొగాట్ విషయంలో మాత్రం ఒలింపిక్ కమిటీ అత్యంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. ఆమెకు మెడల్ దూరం చేసింది. ఇలాంటి నిబంధనలు ఒలింపిక్ స్థాయిని తగ్గిస్తాయి. ఆమె పై అనర్హత వేటువేసి నిర్వాహకులు రాక్షసానందం పొందినట్టు నాకు అనిపిస్తోందని” విజేందర్ పేర్కొన్నాడు..
రెజ్లింగ్ ఫైనల్ మ్యాచ్లో 50 కిలోల విభాగంలో వినేశ్ ఫొగాట్ రంగంలోకి దిగింది. మ్యాచ్ కు ముందు రెజ్లర్ల బరువును నిర్వాహకులు తూస్తారు. ఒకవేళ బరువు పై క్రీడాకారులకు ఏమైనా అనుమానాలు ఉంటే 30 నిమిషాల వ్యవధి ఇస్తారు. ఈ సమయంలో వారు ఎన్నిసార్లు అయినా తమ బరువును తూచుకోవచ్చు. అయితే వినేశ్ ఫొగాట్ తన బరువును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. జుట్టు కత్తిరించుకుంది. శరీరం నుంచి కాస్త రక్తం తొలగించుకుంది. అయినప్పటికీ ఆమె 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉండడంతో మెడల్ ఆశలు ఆవిరయ్యాయి.