Ravindra Jadeja: ఇండియన్ క్రికెట్ టీం లో ఆల్ రౌండర్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు రవీంద్ర జడేజా. స్పిన్ బౌలింగ్ వెయ్యడం లో నిష్ణాతుడైన జడేజా, బ్యాటింగ్ లో కూడా అదే రేంజ్ దూకుడు ని చూపిస్తూ ఇండియన్ టీం మిడిల్ ఆర్డర్ బాధ్యత మొత్తం తన భుజాల మీద వేసుకున్నాడు. ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ తో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ వికెట్ల మీద వికెట్లు తీస్తూ ముందుకు దూసుకెళ్తుంటే , రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలం తో మిడిల్ ఆర్డర్ ని కుప్ప కూల్చాడు. అయితే బౌలింగ్ చేసే ముందు జడేజా తన జుట్టుని సన్ గ్లాసెస్ లో చూసుకొని సరి చేసుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
సహచరులందరూ ఈయనని రాక్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు, బౌలింగ్ చేసే ముందు తన జుట్టు చెదిరిపోయి ఉండదని గమనించిన జడేజా వెంటనే తన సన్ గ్లాసెస్ తీసి జుట్టు చాలా స్టైల్ గా సరి చేసుకున్నాడు. దీనిని చూసి నెటిజెన్స్ ‘బాయ్స్ ఇంతే’ అంటూ వీడియో ని అప్లోడ్ చెయ్యగా, అది నిమిషాల వ్యవధి లోనే వైరల్ గా మారింది. ఇకపోతే జడేజా యాక్సిడెంట్ కారణంగా చాలా కాలం వరకు టీం కి దూరంగా ఉంటూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత పూర్తిగా కోలుకున్నాక టీంలోకి అడుగుపెట్టిన ఆయన చెలరేగిపోయి మరీ ఆడుతున్నాడు. రీసెంట్ గానే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీం 5 వ సారి కప్ కొట్టడానికి గల బలమైన కారణాలలో ఒకడిగా నిలిచాడు జడేజా. లాస్ట్ లో ఆయన ఆ విన్నింగ్ షాట్ కొట్టకపోయ్యుంటే చెన్నై సూపర్ కింగ్స్ టీం కప్ గెలిచేది కాదు, ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ లో కూడా తన సత్తా చూపిస్తూ ముందుకెళ్తున్నాడు.