Shubman Gill: ప్రస్తుతం ఇండియన్ టీం ప్లేయర్లు అందరుకూడా మంచి ఫామ్ లో ఉన్నారు అనుకుంటున్న టైం లో ఇండియన్ ఓపెనర్ ప్లేయర్ అయిన శుభ్ మన్ గిల్ డెంగ్యూ ఫీవర్ వచ్చి టీం నుంచి దూరమవ్వడం కొంత వరకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన పొజిషన్ చాలా దారుణంగా ఉండటం తో ఆయన కి ఫీవర్ తగ్గిన కూడా కొద్దీ రోజులు రెస్ట్ ఇవ్వాలని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ఈ టైం లో ఆయన చేత మ్యాచులు ఆడించడం కూడా కరెక్ట్ కాదు.అయితే వరల్డ్ కప్ కి ముందు చాలా మంచి అంచనాలు పెట్టుకొని మొదటి సారి వరల్డ్ కప్ ఆడబోతున్న గిల్ తన సత్తా ఏంటో ఈ వరల్డ్ కప్ లో చూపించాలి అని అనుకుంటున్నా టైం లో ఆయనకి అనుకోకుండా డెంగ్యూ ఫీవర్ రావడం వల్ల ఆయన గత కొద్దీ రోజులు గా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.
అయితే ఒక చిన్న దోమ కుట్టడం వల్ల ఆయనకి డెంగ్యూ ఫీవర్ అనేది వచ్చింది ఇప్పుడు ఆ ఒక్క దోమ ఇండియన్ క్రికెట్ అభిమానుల అందరి కలల్లో నీళ్లు జల్లిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గిల్ టీం లో ఉంటె ఇండియన్ టీం కి చాలా వరకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే గత కొద్దిరోజులు గా ఆయన ఫామ్ ని కనక మనం చూసుకుంటే ఆయన వరుసగా మంచి సెంచరీలని చేసి ఇండియన్ టీం కి మంచి విజయాలను అందిస్తూ వస్తున్నాడు కాబట్టి ఆయన టీం కి కీలక ప్లేయర్ అనే చెప్పాలి…
ఇక ఇప్పుడు నెట్లో చాలా మంది ఇండియన్ క్రికెట్ అభిమానులు కావచ్చు గిల్ అభిమానులు కావచ్చు అందరు కూడా ఆయనకి డెంగ్యూ రావడానికి కారణం అయిన దోమని తిడుతున్నారు.ఎందుకంటే పోయి పోయి ఆ దోమ గిల్ కె కొట్టాలా అంటూ కొంత మంది కామెంట్లు పెడుతుంటే మరికొంత మంది మాత్రం విదేశీ ప్లేయర్లని వదిలేసి కావాలనే ఈ దోమ గిల్ ని కుట్టింది అంటూ మరి కొంత మంది కామెడీ గా కూడా కామెంట్లు చేస్తున్నారు. దాని గురించే ఇప్పుడు సోషల్ మీద మొత్తం వైరల్ అవుతుంది.ఒక దోమ వల్ల వరల్డ్ కప్ మొత్తం డిస్ట్రబ్ అయింది అంటూ మరికొంత మంది వల్ల కోపాన్ని తెలియజేస్తున్నారు…
ఇక వరుసగా మూడు మ్యాచులకి గిల్ ఆల్మోస్ట్ దూరం అయినట్టే మరి నాలుగోవ మ్యాచ్ కోసం అయిన ఆయన అందుబాటులో ఉంటాడా అంటే అది కూడా మనం ఇప్పుడే క్లారిటీ గా చెప్పలేం ఇంకో రెండు,మూడు రోజులు గడిస్తే అప్పుడు గిల్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేదాని మీద సరైన క్లారిటీ వస్తుంది అప్పుడు మాత్రమే గిల్ ఆడగలడా లేదా అనేది తెలుస్తుంది…ఇక ఈ సమయం లో రేపు ఆడబోయే మ్యాచ్ లో ఇండియా భారీ విజయం సాధించాలని కోరుకుందాం…