ODI World Cup: ప్రపంచ కప్ హిస్టరీలోనే ఈ ఇయర్ ఆడుతున్న మ్యాచ్ ల్లో ఇప్పటికే చాలా రికార్డులు నమోదు అయ్యాయి. ఇక ఇప్పటికే వరుసగా అన్ని టీములు మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సందర్భం లో వరల్డ్ కప్ లో చాలా రికార్డులు అనేవి బ్రేక్ అవుతూ ఉన్నాయి.ఈ సంవత్సరం వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో 12 సెంచరీలు నమోదు అయ్యాయి. మొత్తం వరల్డ్ కప్ హిస్టరీలోనే టాప్ టెన్ మ్యాచెస్ లో లోనే ఇన్ని సెంచరీలు నమోదవడం నిజంగా ఇదే మొదటి సారి. ప్రతి టీం లో ఉన్న ప్లేయర్లు ఈజీగా సెంచరీలు చేస్తూ సునయాసం గా భారీ స్కోరును రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక ఈ ఇయర్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టీమ్ ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో రచిన్ రవీంద్ర , డేవిన్ కాన్వే ఇద్దరు కూడా సెంచరీలు చేసి వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ లోనే ఒక ఇన్నింగ్స్ లో ఇద్దరు ప్లేయర్లు సెంచరీలు చేసి సరి కొత్త రికార్డును క్రియేట్ చేశారు… ఇక వరల్డ్ కప్ లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన న్యూజిలాండ్ ప్లేయర్లుగా కూడా హిస్టరీని క్రియేట్ చేశారు… అలాగే సౌత్ ఆఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ఏకంగా ముగ్గురు సెంచరీ చేసి రికార్డుని క్రియేట్ చేశారు. ఇక శ్రీలంక, పాకిస్తాన్ మ్యాచ్ లో ఒక మ్యాచ్ లోనే నలుగురు సెంచరీలు చేసి మరొక రికార్డుని క్రియేట్ చేశారు. ఈ వరల్డ్ కప్ లో వరుసగా రికార్డ్ లు అనేవి క్రియేట్ అవుతూనే ఉన్నాయి…
ఇప్పటివరకు జరిగిన అన్ని వరల్డ్ కప్ లలో మొదటి పది మ్యాచ్ ల్లోనే అత్యధిక సెంచరీలు సాధించిన సంవత్సరం ఏదో ఒకసారి తెలుసుకుందాం..
1999 లో ఒక సెంచరీ,1879,1983,2019 మొత్తం మూడు సంవత్సరాల్లో మొదటి 10 మ్యాచ్ లలో కేవలం రెండు సెంచరీలు మాత్రమే నమోదు అయ్యాయి…1996 లో 4 సెంచరీ లు నమోదు అయ్యాయి,అలాగే 1975,1992,2007,2011 సంవత్సరాలలో 5 సెంచరీ లు నమోదు అయ్యాయి,1987,2015 లో 6 సెంచరీ లు నమోదు అయ్యాయి,ఇక 2003 లో 7 సెంచరీ లు నమోదు అవ్వగా, ఇప్పుడు అంటే 2023 లో మాత్రం ఇప్పటి వరకు 12 సెంచరీ లు నమోదు అయ్యాయి…
ఇంకా చెప్పాలంటే ఈ ఇయర్ వరల్డ్ కప్ ముగిసే సమయానికి అత్యధిక సెంచరీలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దాదాపు 20 పైన సెంచరీలు వరల్డ్ కప్ లో నమోదవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ ఇయర్ వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన ముగ్గురు ప్లేయర్లు గా చోటు దక్కించుకున్న ప్లేయర్లలో మార్కరం 49 బంతుల్లో సెంచరీ చేశాడు,రోహిత్ శర్మ 63 బంతుల్లో సెంచరీ చేశాడు, కుశాల్ మెండిస్ 65 బంతుల్లో సెంచరీ చేశాడు…ఇలా వరల్డ్ కప్ లో ఇప్పటికే చాలా రికార్డ్ లు నమోదు అవుతూ వచ్చాయి. ఇక ఇది ముగిసే సమయానికి ఇంకా చాలా రికార్డ్ లు క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంది…