Mohammed Shami : చీల మండల గాయం వల్ల అతడు ఐపిఎల్ కు దూరమయ్యాడు. దానికంటే ముందు జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఆడలేకపోయాడు. స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లోనూ మెరువలేకపోయాడు. తనకైన గాయానికి సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకోవడానికి షమీ లండన్ వెళ్లిపోయాడు. శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం అతడు తిరిగి నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిపోయాడు. అక్కడ చాలా రోజులపాటు చికిత్స పొందాడు. సామర్ధ్య పరీక్షలో నెగ్గాడు. దీంతో ప్రస్తుతం రంజీ క్రికెట్ లోకి అతడు ఎంట్రీ ఇచ్చాడు. బెంగాల్ జుట్టు తరఫున అతడు ఆడుతున్నాడు. మధ్యప్రదేశ్ పై జరిగిన మ్యాచ్లో 7 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఫీల్డింగ్ లోను అద్భుతమైన ప్రదర్శన చేశాడు. దీంతో త్వరలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడికి ఆడేందుకు మార్గం సుగమం అయిందని తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బి సి సి ఐ పెద్దల ఎదుట షమీ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే షమీ ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడతాడని సమాచారం. పైగా అతడు తన సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో నిరూపించుకున్న నేపథ్యంలో.. ఇక తిరుగుండదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ షమీకి సానుకూలంగా ఉండగా.. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.
మోసం చేస్తున్నాడు
సామాజిక మాధ్యమాల వేదికగా మోహన్ కృష్ణ అనే నెటిజన్ షమీ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. షమీ తన వయసును దాచిపెడుతున్నాడని.. అందులోనూ అబద్ధం చెప్పాడని దుయ్యబట్టాడు.. షమీకి 42 సంవత్సరాలు ఉంటే.. 34 ఏళ్లు మాత్రమేనంటూ బీసీసీఐని మోసం చేస్తున్నాడని మోహన్ కృష్ణ ఆరోపించాడు. అంతేకాదు షమీ కి చెందినదిగా అతని ప్రస్తావిస్తూ ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఫోటోను ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అంతేకాదు దీనిపై బీసీసీఐ లోతుగా దర్యాప్తు చేయాలని అతడు డిమాండ్ చేశాడు. అయితే మోహన్ కృష్ణ చేసిన ట్వీట్ పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇలాంటి ఫేక్ ఫోటోలు సృష్టిస్తున్నారని.. వ్యక్తిగత జీవితాన్ని.. ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడుతున్నారు..”ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా ఉంటారు. సమాజంలో పేరు తెచ్చుకుంటే చాలు రంధ్రాన్వేషణ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇలాంటి వ్యవహారాలు మానుకోకపోతే మా నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని” షమీ అభిమానులు మోహన్ కృష్ణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.